ఎయిర్ షోలో బీభత్సం : మంటల్లో 100 కార్లు
బెంగళూరులోని ఎయిరో ఇండియా షో 2019లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జనరల్ పార్కింగ్ ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 100 కార్లకుపైగా దగ్ధమయ్యాయి.

బెంగళూరులోని ఎయిరో ఇండియా షో 2019లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జనరల్ పార్కింగ్ ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 100 కార్లకుపైగా దగ్ధమయ్యాయి.
బెంగళూరులోని ఎయిర్ ఇండియా షో 2019లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జనరల్ పార్కింగ్ ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 100 కార్లు వరకు దగ్ధమయ్యాయి. AFS ఎల్హంక ఎయిర్ బేస్ భారతి నగర్ గేట్ 5 దగ్గర శనివారం (ఫిబ్రవరి 23, 2019) ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఎయిర్ ఇండియా షో సందర్భంగా పార్కింగ్ చేసిన ప్రాంతంలో ఓ కారులో మంటలు చెలరేగాయి. ఒక కారు నుంచి మరో కారుకు మంటలు వ్యాపించి 100 కార్లకు పైగా దహనమయినట్టు పోలీసులు తెలిపారు.
అప్రమత్తమైన ఎయిర్ ఫోర్స్, బెంగళూరు పోలీసులు ఘటనా స్థలంలో ఉన్న వారందరిని దూరంగా తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్ లు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. భారీ సంఖ్యలో కార్లను పార్క్ చేయడంతో ఎక్కువ సంఖ్యలో కార్లు మంటల్లో దగ్ధమయ్యాయి. గడ్డివాములో సిగరేట్ పీక పడటంతో మంటలు చెలరేగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Also: సిగరెట్ పీక.. 300 కార్లను బూడిద చేసింది
ఘటనా స్థలానికి చేరుకున్న 10 ఫైరింజన్లు మంటలార్పుతున్నాయి. భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు అధికారులు చెబుతున్నారు. పార్క్ చేసిన కార్లలో 100 పైగా వాహనాలు, బైకులు అగ్నికి ఆహుతి అయ్యాయి. కార్లు పార్క్ చేసిన ప్రాంతంలో ఎండిపోయిన గడ్డి ఉండంటంతో సిగరేట్ నిప్పు అంటుకుని పెద్ద ఎత్తున పొగ వ్యాపించి మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. దట్టమైన పొగలు వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. పరిసర ప్రాంతాల్లోని స్థానికులను దూరంగా తరలించారు.ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరిగినట్టు సమాచారం లేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు కూడా తెలియాల్సి ఉంది. ఇటీవల ఎయిరో ఇండియా షో లో వైమానిక దళం విన్యాసాలు చేస్తున్న సమయంలో ఓ విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే.
#WATCH Nearly 80-100 cars gutted after fire broke out in dry grass at the car parking area near #AeroIndia2019 venue in Bengaluru pic.twitter.com/xGdDKm4D3V
— ANI (@ANI) February 23, 2019
Read Also: గెట్ రెడీ : రైల్వేలో 1.3 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్