Fire Accident At Footwear factory : ఢిల్లీ ఫుట్‌వేర్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
దేశ రాజధాని ఢిల్లీలో మరో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నరేలా పారిశ్రామిక ప్రాంతంలో మూడంతస్తుల భవనంలోని ఫుట్‌వేర్ తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Fire Accident At Footwear factory
Fire Accident At Footwear factory : దేశ రాజధాని ఢిల్లీలో మరో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నరేలా పారిశ్రామిక ప్రాంతంలో మూడంతస్తుల భవనంలోని ఫుట్‌వేర్ తయారీ ఫ్యాక్టరీలో గురువారం (సెప్టెంబర్ 22,2022)భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఏడు అగ్నిమాపక యంత్రాలతో ఘటానాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పటానికి తీవ్రంగా శ్రమించారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ఘటనా ప్రాంతంలో ఏడు అగ్నిమాపక యంత్రాలతో పాటు సిబ్బంది శ్రమించారు. కానీ ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
కాగా ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు పరిసర ప్రాంతంలోని కంపెనీలకు మంటలు విస్తరించకుండా చర్యలు తీసుకోవటంతో ప్రమాదం తీవ్రత అదుపులోనే ఉంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.ఈ ప్రమాదానికి గత కారణాలను అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.