West Bengal : బ్లాక్ ఫంగస్ తో మహిళ మృతి ?, తొలి కేసు ?

వెస్ట్ బెంగాల్ లో తొలి బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది. 32 ఏండ్ల మహిళ దీనికారణంగా చనిపోయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. బ్లాక్ పంగస్ సోకిందని, దీంతో ఆమె మరణించిందని వైద్యులు వెల్లడిస్తున్నట్లు తెలుస్తోంది.

West Bengal : బ్లాక్ ఫంగస్ తో మహిళ మృతి ?, తొలి కేసు ?

Black Fungus

Updated On : May 23, 2021 / 9:48 AM IST

First Black Fungus Death : భారతదేశాన్ని కరోనా ఓ వైపు కరోనా అష్టకష్టాలు పెడుతుంటే..మరోవైపు బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. పలు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. అయితే..వెస్ట్ బెంగాల్ లో తొలి బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది. 32 ఏండ్ల మహిళ దీనికారణంగా చనిపోయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. బ్లాక్ పంగస్ సోకిందని, దీంతో ఆమె మరణించిందని వైద్యులు వెల్లడిస్తున్నట్లు తెలుస్తోంది.

హరిదేవ్ పూర్ ప్రాంతానికి చెందిన షాంపా చక్రవర్తి (32) మహిళకు కరోనా వైరస్ సోకింది. దీంతో శంభునాథ్ పండిట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో..ఈమెకు బ్లాక్ ఫంగస్ సోకిందని, దీంతో ఆమె మరణించిందని ఆరోగ్య శాఖాధికారులు వెల్లడిస్తున్నట్లు తెలుస్తోంది. మరో ఐదుగురు ఈ వ్యాధి బారిన పడ్డారని, వీరంతా ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు వారు వెల్లడిస్తున్నారు.

దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురు కావడం, ముక్కు చుట్టూగా ఎర్రగా కావడం, ఒళ్లు నొప్పులు లేదా జ్వరం..కళ్లు ఎరుపు రంగులోకి మారడం, రక్తం కక్కుకోవడం లాంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఇలాంటి లక్షణాలున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Read More : Asian Boxing Championship : గంట సేపు గాల్లోనే…భారత బాక్సింగ్ బృందానికి చేదు అనుభవం