పార్లమెంట్ సెషన్‌కు సర్వం సిద్ధం.. సభ్యుల ప్రమాణం, స్పీకర్‌ ఎన్నిక.. ఇంకా..

First Parliament session: సోమవారం మోదీతో పాటు కేంద్ర మంత్రులు, ఏపీ ఎంపీలు..

పార్లమెంట్ సెషన్‌కు సర్వం సిద్ధం.. సభ్యుల ప్రమాణం, స్పీకర్‌ ఎన్నిక.. ఇంకా..

Parliament building

Updated On : June 24, 2024 / 4:21 PM IST

పార్లమెంట్ సమావేశాలకు అంతా రెడీ అయింది. సోమవారం నుంచి 18వ పార్లమెంట్ సెషన్ జరగనుంది. మొదట రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఎంపీ భర్తృహరి మెహతాజ్‌ను ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయిస్తారు.

ప్రొటెం స్పీకర్‌ మెహతాజ్‌.. సోమ, మంగళవారం రెండ్రోజులు కొత్తగా ఎన్నికైన లోక్‌సభ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సోమవారం మోదీతో పాటు కేంద్ర మంత్రులు, ఏపీ ఎంపీలు కలిపి మొత్తం 280 మంది సభ్యులు ప్రమాణం చేస్తారు. మంగళవారం తెలంగాణ, మిగిలిన ఎంపీల ప్రమాణ స్వీకారం ఉంటుంది.

ఈ నెల 26న లోకసభ స్పీకర్ ను ఎన్నుకుంటారు.  మరోవైపు డిప్యూటీ స్పీకర్‌ పదవిని తమకే ఇవ్వాలని విపక్ష పార్టీల కూటమి కోరుతున్నట్టు సమాచారం.  17వ లోక్‌సభలో మాత్రం డిప్యూటీ స్పీకర్‌ పదవి ఎవరికీ ఇవ్వలేదు.

ఇదిలా ఉండగా.. జూన్‌ 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం చేయనున్నారు. 18వ లోక్‌సభ తొలి సమావేశాలకు ముందే అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం వేడెక్కుతోంది. ప్రొటెం స్పీకర్‌ ఎంపిక వివాదానికి కారణమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏడుసార్లు ఎంపీ అయిన భర్తృహరి మహతాబ్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించింది. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ మండిపడుతోంది. పార్లమెంటరీ సంప్రదాయాలను బీజేపీ తుంగలో తొక్కిందని ఆరోపించింది.

Also Read: అమరావతి, పోలవరంపై బాబు ప్రత్యేక నజర్.. శాఖలపై పట్టు సాధించేందుకు పవన్ ఫోకస్