భారత్‌లో తొలి కరోనా వైరస్ మరణం..?
ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కొవిడ్-19(కరోనా) వైరస్.. భారత్ లోనూ అలజడి రేపుతోంది. మన దేశంలో తొలి కరోనా కేసు కేరళలో నమోదైన సంగతి తెలిసిందే. చైనా నుంచి

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కొవిడ్-19(కరోనా) వైరస్.. భారత్ లోనూ అలజడి రేపుతోంది. మన దేశంలో తొలి కరోనా కేసు కేరళలో నమోదైన సంగతి తెలిసిందే. చైనా నుంచి
ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కొవిడ్-19(కరోనా) వైరస్.. భారత్ లోనూ అలజడి రేపుతోంది. మన దేశంలో తొలి కరోనా కేసు కేరళలో నమోదైన సంగతి తెలిసిందే. చైనా నుంచి వచ్చిన ముగ్గురు కేరళ వ్యక్తుల్లో కరోనా లక్షణాలు కనిపించాయి. చికిత్స అందించిన తర్వాత వారంతా కోలుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలో మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. మన దేశంలో కరోనా వైరస్ తో తొలి మరణం సంభవించిందనే వార్త కలకలం రేపుతోంది.
చైనా నుంచి వచ్చిన శక్తికుమార్:
తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి కరోనా వైరస్ లక్షణాలతో చనిపోయాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల చైనా నుంచి పుదుకొట్టైకి వచ్చిన వ్యక్తి అనారోగ్యంతో చనిపోయాడు. అతడి పేరు శక్తికుమార్. ఫిబ్రవరి 4న చైనా నుంచి వచ్చాడు. తీవ్ర అనారోగ్యంతో మధురై ఆసుపత్రిలో చేరాడు. అక్కడి చికిత్స పొందుతూ ఫిబ్రవరి 16న చనిపోయాడు. చైనా నుంచి వచ్చిన కొన్ని రోజులకే అనారోగ్యానికి గురికావడం, చికిత్స పొందుతూ చనిపోవడం అనుమానాలకు దారితీసింది.
కరోనాతో మృతి..?
కరోనా వైరస్ కారణంగానే అతడి చనిపోయి ఉంటాడనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు చైనా నుంచి 115మంది తమిళులు పుదుకొట్టైకి వచ్చారు. అనారోగ్యంతో శక్తికుమార్ చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ప్రత్యేక వైద్య బృందాలు పుదుకొట్టై గ్రామానికి తరలివెళ్లాయి.
చైనాలో రెస్టారెంట్ నడుపుతున్న శక్తికుమార్:
మృతుడు శక్తికుమార్.. చైనాలో రెస్టారెంట్ నడుపుతున్నాడు. జాండిస్ కారణంగా సొంతూరికి వచ్చాడు. గ్రామంలో చికిత్స తీసుకున్నాడు. పని మనుషులు లేకపోవడంతో జాండిస్ పూర్తిగా నయం కాకపోయినా.. తిరిగి చైనా వెళ్లిపోయాడు శక్తికుమార్. కొన్ని రోజులకు మళ్లీ పుదుకొట్టైకి తిరిగి వచ్చాడు. అనారోగ్యం కారణంగా మధురైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ ఫిబ్రవరి 16వ తేదీన కన్నుమూశాడు. చైనా నుంచి రావడంతో.. కరోనా వైరస్ కారణంగానే చనిపోయి ఉంటాడా అనే అనుమాలు వ్యక్తమవుతున్నాయి. రంగంలోకి దిగిన ఆరోగ్య శాఖ అధికారులు దర్యాఫ్తు చేపట్టారు. ఏ కారణంతో శక్తికుమార్ చనిపోయాడో తెలుసుకునే పనిలో పడ్డారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి:
కరోనా వైరస్ చైనాతో పాటు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. వైరస్ కారణంగా ఇప్పటికే 1873 మంది ప్రాణాలు కోల్పోయారు. 72వేల 332 మందికి కరోనా సోకింది. వీరిలో 11వేల 795 మంది పరిస్థితి విషమంగా ఉంది. కరోనా వైరస్ 29 దేశాలకు విస్తరించింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై పోరాడేందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ముందుకొచ్చింది. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు సిద్ధమైంది. వుహాన్ సిటీలో సేవలందించేందుకు మరో 30 వేల మంది మెడికల్ స్టాఫ్ సిద్ధమయ్యారు.
Read More>> నెల్లూరులో క్రికెట్ గ్రౌండ్ లో క్షుద్రపూజల కలకలం.. బొమ్మ వేసి నల్లకోడి బలిచ్చారు