అలా ఎలా : ఊపిరితిత్తుల్లో చేప తల

  • Published By: madhu ,Published On : December 19, 2019 / 04:24 AM IST
అలా ఎలా : ఊపిరితిత్తుల్లో చేప తల

Updated On : December 19, 2019 / 4:24 AM IST

తింటే కడుపులోని జీర్ణాశయానికి వెళ్తుంది గానీ ఊపిరితిత్తుల్లోకి చేప తల చేరడమేంటి.. ఎలా చేరింది. వైద్యులకు షాక్ అనిపించిన ఈ ఘటనపై పూర్తి వివరాలిలా ఉన్నాయి. 

52 సంవత్సరాలు ఉన్న ఎన్నారైకి రెండు సంవత్సరాలుగా ఫీవర్ వస్తోంది. ఎన్నో ఆస్పత్రుల్లో చూపించుకున్నాడు. కానీ లాభం లేకపోయింది. ఎన్ని మందులు వాడినా..జ్వరం తగ్గడం లేదు. ఈయన స్వస్థలం కేరళ. ఇటీవలే ఆయన అక్కడుకు వచ్చాడు. తర్వాత కొచ్చిలోని అమృత ఇన్ స్టిట్యూట్ ఆఫ మెడికల్ సైన్స్‌స్‌కు వెళ్లాడు. తొలుత సాధారణ జ్వరమే అని వారు కూడా అనుకున్నారు.

తరచూ జ్వరం, దగ్గు వస్తుందని..తన పరిస్థితి మొత్తం చెప్పాడు. దీంతో అక్కడున్న వైద్యులకు ఏదో డౌట్ వచ్చింది. పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. దీనికి అతను ఒకే చెప్పాడు. తీరా..స్కానింగ్ చూసిన తర్వాత డాక్టర్లు షాక్ తిన్నారు. అతని ఊపిరితిత్తుల్లో చేప తల భాగం కనిపించింది. 5×3 సెంటిమీటర్లన్న దీనిని తొలగించాలంటే..వెంటనే ఆపరేషన్ నిర్వహించాలని..విజయవంతంగా దానిని తొలగించినట్లు డాక్టర్ టింకూ వెల్లడించారు. 

అసలు చేప తల అక్కడకు ఎలా వెళ్లిందబ్బా..అని ఆలోచించుకున్నాడు. చివరకు గుర్తుకొచ్చింది. రెండున్నర సంవత్సరాల క్రితం..ఖతార్‌లోని ఓ ఎయిర్ పోర్టు రెస్టారెంట్లో ఫిష్ ఫ్రై తిన్నాడంట. అప్పుడే ఏదో ఊపిరితిత్తుల్లోకి వెళ్లినట్లు గ్రహించాడు. తర్వాత నార్మల్ కావడంతో పట్టించుకోలేదు. కానీ..కొంతకాలం తర్వాత..జ్వరం..ఇతర అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి. చివరకు కొచ్చిలోని వైద్యులు పరీక్షించి..సిటీ స్కాన్, ఎక్స్ రే వంటి పరీక్షలు నిర్వహించడంతో అసలు విషయం బయటకు తెలిసింది. ఆపరేషన్ జరిగిన అనంతరం 48 గంటల తర్వాత అతడిని డిశ్చార్జ్ చేశారు.