Terrorist Sympathizers Arrest : జమ్ముకశ్మీర్ లో ఐదుగురు హిజ్బుల్ టెర్రరిస్టు సానుభూతిపరుల అరెస్టు

జమ్ముకశ్మీర్ లో ఐదుగురు టెర్రరిస్టు సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడంతోపాటు ఆయుధాలు సరఫరా చేస్తున్న ఐదుదుగురు హిజ్బుల్ ముజాహిదీన్ సానుభూతిపరులను అరెస్టు చేశారు.

Terrorist Sympathizers Arrest : జమ్ముకశ్మీర్ లో ఐదుగురు హిజ్బుల్ టెర్రరిస్టు సానుభూతిపరుల అరెస్టు

Hizbul Mujahideen

Updated On : December 23, 2022 / 2:03 PM IST

Terrorist Sympathizers Arrest : జమ్ముకశ్మీర్ లో ఐదుగురు టెర్రరిస్టు సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడంతోపాటు ఆయుధాలు సరఫరా చేస్తున్న ఐదుగురు హిజ్బుల్ ముజాహిదీన్ సానుభూతిపరులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి భారీగా పేలుడు సామాగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

కుప్వారాలో హిజ్బుల్ టెర్రర్ మాడ్యూల్ కు సంబంధించి మిలిటరీ ఇంటెలిజెన్స్, జిల్లా పోలీసులు, ఇతర ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కశ్మీర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో సైన్యం, స్థానిక పోలీసులు కుప్వారా జిల్లాలోని క్రాల్ పోరాలో సోదాలు నిర్వహించారు. హిజ్బుల్ సానుభూతిపరులైన అబ్ రవూఫ్ మాలిక్, అల్తావఫ్ అహ్మద్ పయర్, రియాజ్ అహ్మద్ లోనేను అదుపులోకి తీకుసుకుని విచారించారు.

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌ ప్రాంతంలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

విచారణలో నిందితులు ఇచ్చిన సమాచారంతో మరో ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నివాసల్లో భారీగా ఆయుధాలు, మందు గుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. వీరు ఉగ్రవాదులకు సహాయంతోపాటు టెర్రిరిస్టులకు ఆశ్రయం కల్పించడం, ఆయుధాలు, మందుగుండు సమకూర్చుతున్నారని అధికారులు వెల్లడించారు.