కాల్పులతో దద్దరిల్లిన అంబుజ్ మడ్ : ఐదుగురు మావోయిస్టుల మృతి

ఛత్తీస్ గడ్ నారాయణ్ పూర్ జిల్లా అంబుజ్ మడ్ కాల్పులతో దద్దరిల్లింది. మావోయిస్టులు – భద్రతా బలగాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందగా ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. జవాన్లను నారాయణపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
గత కొంతకాలంగా మావోయిస్టులను అణిచివేసే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అంబుజ్ మడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై బలగాలు దృష్టి సారించాయి. ఓ రహస్య ప్రాంతంలో మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారనే సమాచారం అందింది. వెంటనే కూంబింగ్ నిర్వహించారు. భారత బలగాలను చూసిన మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ కాల్పులను తిప్పికొట్టారు. మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను నారాయణపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన అనంతరం ఆ ప్రాంతంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఛత్తీస్ గడ్ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు, ఇతర సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి సోదాలు చేస్తున్నారు.
Read More : దక్షిణాదిలో ఎలుక మాంసం కిలో రూ.200