Rajasthan Road Accident : రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం …ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు.

Rajasthan Road Accident : రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం …ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

Road Accident

Updated On : August 8, 2021 / 7:47 AM IST

Five killed in road accident : రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. నాగౌర్ లోని కుచమన్ వద్ద శనివారం ఓ ట్రక్కు.. కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రుల్లో బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం జైపూర్‌కు తరలించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతులు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం.

మృతుల కుటుంబాలకు సీఎం అశోక్‌ గెహ్లాత్‌ సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.