అమెరికా,చైనా కన్నా మనమే బెటర్ : భారీ ఆర్థిక సంస్కరణలు ప్రకటించిన సీతారామన్

ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమందగమనం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. సంపద సృష్టించేవాళ్లను ప్రోత్సహిస్తామన్నారు. అమెరికా, చైనా తదితర దేశాలతో పోలిస్తే మన దేశ పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు. భారత్ వేగంగా వృద్ధి రేటు నమోదు చేస్తోందన్నారు. 2014 నుంచి సంస్కరణలే అజెండాగా పనిచేస్తున్నామని, గత ఐదేళ్లలో ఎన్నో వాణిజ్య సంస్కరణల్ని తీసుకొచ్చామని వెల్లడించారు. పన్ను విధానాల్లోనూ సంస్కరణలు తెచ్చామని గుర్తు చేశారు.
ఇవాళ(ఆగస్టు-23,2019) ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ… పన్ను వేధింపులపై వస్తున్న ఆరోపణలకు సమాధానం ఇచ్చారు. పన్ను ఎగవేసిన వారిపై జరిమానా విధిస్తున్నామని, కానీ వారిని కోర్టుకు ఈడ్చడం లేదన్నారు. ఆమె అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని వస్తున్న ఊహాగానాలను ఆమె కొట్టిపారేశారు.
అన్ని ఐటీ నోటీసులను అక్టోబర్ ఒకటవ తేదీలోగా క్లియర్ చేస్తామన్నారు. ఐటీ ఎగవేతలపై ఎవరెవరికి సమన్లు ఇస్తున్నామన్న విషయాన్ని ఇక నుంచి సెంట్రలైజ్ చేయనున్నట్లు సీతారామన్ తెలిపారు.సమన్ల కోసం ఓ సెంట్రలైజ్డ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.
కంపెనీల చట్టం కింద 14వేల ప్రాసిక్యూషన్లు ఉపసైంహరించుకున్నట్లు తెలిపారు. ఫారిన్ పాలసీ ఇన్వెస్ట్‌మెంట్(ఎఫ్‌పీఐ)లపై సర్‌చార్జీలను ఎత్తివేసినట్లు ఆమె తెలి. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడాన్ని మరింత సులభతరం చేసినట్లు ఆమె తెలిపారు.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబులిటీ నిధులను ఖర్చు చేయకున్నా.. దాన్ని క్రిమినల్ కేసుగా పరిగణించబోమన్నారు. వాటిని సివిల్ కేసులుగా ట్రీట్ చేయనున్నారు. సూపర్ రిచ్ ట్యాక్స్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లను మినహాయిస్తున్నట్లు మంత్రి సీతారామన్ తెలిపారు.
స్టార్ట్ అప్స్, ఇన్వెస్టర్లపై విధిస్తున్న ఏంజిల్ ట్యాక్స్‌ను ఉపసంహరించనున్నట్లు ఆమె చెప్పారు. 4 లక్షల కోట్ల లిక్విడ్ క్యాష్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. బ్యాంకులకు సుమారు 70 వేల కోట్ల అదనపు నిధులను రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు.
ఇకపై రెపోరేటుకు అనుగుణంగానే వడ్డీ, వాహన రుణాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెపో రేట్లకు అనుగుణంగానే గృహ, వాహన రుణాలపై భారం తగ్గనుందన్నారు. ఈ తగ్గింపుతో గృహ, వాహన రుణాల వాయిదాలు అనుసంధానమవుతాయని చెప్పారు.
Finance Minister Nirmala Sitharaman: The growth rate, still in comparison to many countries is high and if anything even in comparison to the US and China, our growth rate is higher than everybody else. pic.twitter.com/IbnaA1DATP
— ANI (@ANI) August 23, 2019