Virbhadra Singh: హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం కన్నుమూత

హిమాచల్‌ప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత వీరభద్ర సింగ్ (87) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో సిమ్లాలోని ఇందిరగాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌ లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. వీరభద్రసింగ్ పలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా సోమవారం రాత్రి ఆయన ఆరోగ్యం విషమించింది. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఐసీయూకు తరలించగా అక్కడ వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు.

Virbhadra Singh: హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం కన్నుమూత

Virbhadra Singh

Updated On : July 8, 2021 / 8:05 AM IST

Virbhadra Singh: హిమాచల్‌ప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత వీరభద్ర సింగ్ (87) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో సిమ్లాలోని ఇందిరగాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌ లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. వీరభద్రసింగ్ పలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా సోమవారం రాత్రి ఆయన ఆరోగ్యం విషమించింది. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఐసీయూకు తరలించగా అక్కడ వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఆయన్ను బతికించేందుకు డాక్టర్లు ఎంతో ప్రయత్నించగా చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

గురువారం తెల్లవారుజామున 03.40 గంటలకు కన్నుమూసినట్లు ఆయనకు చికిత్స అందిస్తున్న డాక్టర్ జనక్ రాజ్ తెలిపారు. వీరభద్రసింగ్‌ వయసు రీత్యా పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుండగా దానికి తోడు రెండు నెలల వ్యవధిలో ఆయన రెండుసార్లు కరోనా బారిపడ్డారు. మొదట ఏప్రిల్ 12న ఆయన కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా మొహాలీలోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకొని ఏప్రిల్ 23న డిశ్చార్జి అయ్యారు. అనంతరం మొహాలీ నుంచి సిమ్లాకు వెళ్లగా అక్కడ శ్వాస సంబంధ సమస్యలు రావడంతో ఐజీఎంసీలో చికిత్స తీసుకున్నారు.

ఆ తర్వాత జూన్ 11న కూడా మరోసారి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా అప్పటి నుంచి ఆయన అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం విషమించగా.. సోమవారం రాత్రి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. వైద్యులు ఎంత ప్రయతించినా కోలుకోలేని వీరభద్ర సింగ్ గురువారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంతాపం ప్రకటించారు.