Farooq abdulla: జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా నోట దుర్గామాత పాట.. వీడియో వైరల్
జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా కత్రాలోని ఓ ఆశ్రమంలో దుర్గామాత గీతం పాడి భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు.

Farooq Abdullah
Farooq abdulla: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా కత్రాలోని ఓ ఆశ్రమంలో దుర్గామాత గీతం పాడి భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. గురువారం ఓ ఆశ్రమయానికి వచ్చిన ఆయన అక్కడి భజన బృందంతో కలిసి మాతా షేర్ వాలి భజన గీతమైన ‘తునే మఝే బులాయా షేరావాలియో.. మెయిన్ ఆయా మెయిన్ ఆయా షెరావాలియో’’ అంటూ ఉత్సాహంగా ఆలపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కత్రాలోనే మాతా వైష్ణోదేవి ఆలయం కూడా ఉంది.
భక్తి కార్యక్రమంలో ఫరూక్ అబ్దుల్లా గాయకుడిగా మారి స్థానికులతో కలిసి దుర్గా దేవి గీతాన్ని ఆలపించడంతో అక్కడున్న వారు కరతాళ ధ్వనులతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని మతాల బోధనల సారాంశం ఒక్కటేనని, అయితే, కొందరు వ్యక్తులు తమ స్వార్థం కోసం మతాలను దుర్వినియోగం చేస్తున్నారని ఫరూక్ పేర్కొన్నారు. అదేవిధంగా అబ్దుల్లా కత్రాలో రోప్ వే నిర్మాణం వల్ల నెలకొన్న వివాదంపైనా స్పందించారు. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలకు తన మద్దతును తెలిపారు.
కత్రాలో రోప్ వే నిర్మాణం పై వివాదం జరుగుతుంది. శ్రీ మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రాన్ని సందర్శించే యాత్రికుల బేస్ క్యాంప్ అయిన కత్రాలో ప్రతిపాదిత రోప్ వే ప్రాజెక్టుకు వ్యతిరేకంగా దుకాణదారులు, పల్లకి యాజమానులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఆలయ బోర్డుకు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేస్తూ ప్రాజెక్టును నిపిలివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై అబ్దుల్లా మాట్లాడుతూ.. మాతా వైష్ణో దేవి ఆలయ నిర్వాహకులు ప్రజలకు ఇబ్బంది కలిగించే ఇలాంటి పనిని మానుకోవాలని అన్నారు. ఆలయాన్ని నడిపే వారు స్థానిక ప్రజల ప్రయోజనాలకు ఇబ్బంది కలిగించే పని చేయకూడదని అబ్దుల్లా కోరారు. నగర ప్రయోజనాలను పట్టించుకోకుండా ఆలయ బోర్డు రోప్ వే నిర్మిస్తోందని విమర్శించిన అబ్దుల్లా.. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలకు తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
#WATCH | Katra | National Conference leader Farooq Abdullah was seen singing the bhajan ‘Tune Mujhe Bulaya Sherawaliye’ in Katra (23.01) pic.twitter.com/LaRwlHH2rR
— ANI (@ANI) January 24, 2025