జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ జగ్మోహన్ మల్హోత్రా కన్నుమూత
జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ జగ్మోహన్ మల్హోత్రా కరోనా కాటుకు బలయ్యారు.. 94 ఏళ్ల మల్హోత్రాకు కొన్ని రోజుల కిందట కరోనా సోకింది.. దాంతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అయితే సోమవారం ఆయన

Former Jammu And Kashmir Governor
జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ జగ్మోహన్ మల్హోత్రా మరణించారు.. 94 ఏళ్ల మల్హోత్రా గతకొద్ది రోజులగా అనారోగ్యంత్ బాధపడుతున్నారు.. దాంతో ఇటీవల ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అయితే సోమవారం ఆయన ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచారు. రెండుసార్లు జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గా పనిచేశారాయన.. 1984 నుండి 1990 వరకు ఈ పదవిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ,గోవా లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా సేవలందించారు.. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర పట్టణాభివృద్ధి, పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు.
బ్యూరోక్రాట్‌గా ఉన్న జగ్మోహన్ మల్హోత్రా రాజకీయాలపై ఉన్న మక్కువతో తొలుత కాంగ్రెస్ లో చేరారు. అయితే మాజీ ప్రధాని వాజపేయి పిలుపు మేరకు బీజేపీలో చేరారు.. బీజేపీ నుంచి ఒకసారి లోక్ సభకు ఎన్నికయ్యారు. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ను తొలగించే సమయంలో బిజెపి సంప్రదింపుల ప్రచారాన్ని ప్రారంభించినప్పుడు,అమిత్ షా తోపాటు ప్రస్తుత బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ముందుగా జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ జగ్మోహన్ మల్హోత్రా ఇంటికి వెళ్లి ఆయన సలహాలు తీసుకున్నారు.