Raghuram Rajan: రాజకీయాల్లోకి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్..

ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ త్వరలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడన్న వార్తలు విస్తృత ప్రచారంలో ఉన్నాయి. ఈ క్రమంలో తన రాజకీయ రంగ ప్రవేశంపై రఘురామ్ రాజన్ క్లారిటీ ఇచ్చారు.

Raghuram Rajan: రాజకీయాల్లోకి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్..

Raghuram Rajan

Updated On : December 31, 2022 / 1:49 PM IST

Raghuram Rajan: ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ త్వరలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడన్న వార్తలు విస్తృత ప్రచారంలో ఉన్నాయి. ఈ క్రమంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలోసైతం ఇటీవల రఘురామ్ రాజన్ పాల్గొని రాహుల్ కు మద్దతు తెలిపారు. దీంతో రాజన్ రాజకీయ రంగప్రవేశం దాదాపు ఖరారైనట్లేనని, అయితే, ఆయన ఏ పార్టీలో చేరుతారనే అంశంపైనా జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. ఈ వార్తలపై రఘురామ్ రాజన్ క్లారిటీ ఇచ్చారు. రాజకీయ రంగప్రవేశం, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, పలు విషయాలపై ఆయన ఓ జాతీయ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు.

Raghuram Rajan: వృద్ధి రేటు అంతకు పెరిగితే దేశం అదృష్టం చేసుకున్నట్లేనట.. దేశ ఆర్థిక స్థితిపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలు

భారత్ జోడో యాత్రలో పాల్గొనడంపై రఘురామ్ రాజన్ స్పష్టత ఇచ్చారు. ఒక పౌరుడిగా నేను భారత్ జోడో యాత్రలో పాల్గొన్నానని చెప్పారు. తన రాజకీయ రంగ ప్రవేశంపై వస్తున్న ప్రశ్నలకు రఘురామ్ సమాధానం ఇచ్చారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమాత్రం లేదని తేల్చిచెప్పారు. భారత్ జోడో యాత్రలో పాల్గొనడంతో రాజకీయాల్లోకి వస్తున్నానని వస్తున్న వార్తలు కేవలం ప్రచారం మాత్రమేనని, వాటిల్లో ఏమాత్రం నిజం లేదని రఘురామ్ రాజన్ తెలిపారు.

Raghuram Rajan: అందుకే దేశంలో నిరుద్యోగం: రాహుల్‌తో రఘురామ్ రాజన్

ఆర్థిక విషయాలపై మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ప్రపంచ వ్యాప్తంగా వృద్ధి రేటు తగ్గుతుందని అన్నారు. వడ్డీ రేట్లు నిరంతరం పెంచబడుతున్నాయని, దాని ప్రభావం భారతదేశంపై కూడా పడబోతోందని తెలిపారు. దేశంలో వడ్డీ రేట్లు కూడా పెరిగాయి. కానీ భారతదేశం నుండి ఎగమతులు నిరంతరం తగ్గుతున్నాయన్నారు. దేశంలో ద్రవ్వోల్బణం వస్తువుల ధరల పెరుగుదల కారణంగా ఉందని తెలిపారు.