Gas Cylinder Subsidy: గ్యాస్ సిలిండర్‌పై రూ.300 వరకూ సబ్సిడీ పొందండిలా..
LPG ధరలు విపరీతంగా పెరిగి కొన్ని చోట్ల దాదాపు రూ. 1000 మార్కును తాకాయి. సామాన్యుడిపై ఇది పెను భారమే. కొంతకాలం క్రితం వరకు రూ. 594కి లభించే డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ రూ. 834కు..

Gas Subsidy
Gas Cylinder Subsidy: LPG ధరలు విపరీతంగా పెరిగి కొన్ని చోట్ల దాదాపు రూ. 1000 మార్కును తాకాయి. సామాన్యుడిపై ఇది పెను భారమే. కొంతకాలం క్రితం వరకు రూ. 594కి లభించే డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ రూ. 834కు కొన్ని చోట్ల రూ. 1000 వరకు పెరిగింది. గతంలో సబ్సిడీగా వచ్చే డబ్బులను అమాంతం తగ్గించి రూ.20, రూ.30 మాత్రమే ఇస్తున్నారు. అలాంటిది రూ.300వరకూ సబ్సిడీ పొందాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి.
తమ సబ్సిడీ ఖాతాని ఆధార్ కార్డుతో లింక్ చేయండి. ధరల పెంపు వల్ల సామాన్య ప్రజలపై ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇచ్చే మినహాయింపును పెంచాలని నిర్ణయించింది. ఈ సబ్సిడీ పథకం ద్వారా గరిష్ట ప్రయోజనం లభిస్తుంది. గతంలో రూ.174.86 సబ్సిడీ పొందుతుండగా ఇప్పుడు రూ.312.48కి పెంచారు.
గతంలో రూ.153.86 సబ్సిడీని పొందిన వాళ్లకు.. రూ.291.48 వరకు సబ్సిడీ లభిస్తుంది. వీలైనంత త్వరగా మీ సబ్సిడీ బ్యాంక్ ఖాతాను మీ ఆధార్ కార్డ్‌తో లింక్ చేసుకోండి.
………………………………….: బార్‌లో దెయ్యం.. బీర్ గ్లాస్ పడేసిందంటూ గగ్గోలు
ఆధార్‌తో లింక్ చేయాలంటే.. Indane LPG గ్యాస్ సిలిండర్ కస్టమర్ల కోసం cx.indianoil.inని సందర్శించండి. ఇతరులు సంబంధిత బ్యాంకును సందర్శించడం ద్వారా మీరు మీ ఆధార్ కార్డును సబ్సిడీ బ్యాంక్ ఖాతాతో నేరుగా లింక్ చేయవచ్చు.