వ్యానులో గుట్టలుగా కుళ్లిపోయిన శవాలు..!! హడలిపోతున్న స్థానికులు

  • Published By: nagamani ,Published On : June 12, 2020 / 06:49 AM IST
వ్యానులో గుట్టలుగా కుళ్లిపోయిన శవాలు..!! హడలిపోతున్న స్థానికులు

Updated On : June 12, 2020 / 6:49 AM IST

ఈ కరోనా కాలంలో సాటి మనిషి దగ్గరగా ఉండటానికే భయపడిపోతున్నాం. అటువంటిదో మన పక్కనే తీవ్రమైన దుర్వాసన వస్తున్న కుళ్లిపోయిన మృతదేహాలు పడి ఉంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది…?గుండెలు గుబగుబలాడతాయి కదూ..అదిగో సరిగ్గా అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు  భయం మాట ఎలా ఉన్నా కరోనా భయంతో  పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలోని ఓ ప్రాంత వాసులుజ

ఓ మున్సిపల్‌ వ్యానులో 13 కుళ్లిన మృతదేహాలను ఓ శ్మశానవాటికకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో వ్యానులో మృతదేహాలు ఉన్నట్లుగా గుర్తించిన స్థానికులు వారు కరోనా వల్ల మరణించిన వారిగా భావించి స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అవి బాగా డీకంపోజ్ అయినవి కావటంతో అవి తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో స్థానికులు హడలిపోయారు. 

దీంతో ఆ మృతదేహాలను తిరిగి వ్యానులోకి చేర్చి అక్కడ నుంచి మరో శ్మశానవాటికకు తీసుకెళ్లారు. పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో గురువారం (జూన్ 11,2020)సోషల్ మీడియాల్లో వైరల్‌ అయ్యింది. 

దీనిపై స్పందించిన  బెంగాల్ గవర్నర్‌ జగదీప్‌ ధంఖర్‌ మాట్లాడుతూ..మృతదేహాలను సిబ్బంది అలా ఎక్కువ మొత్తంలో వ్యానుల్లో తరలించటం సరికాదన్నారు. ప్రజల మానసిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందనీ..ఆ మృతదేహాలు ఎవరివి, ఎక్కడ చికిత్స పొందారన్నది స్పష్టం చేయాలంటూ సీఎం మమతా బెనర్జీకి ట్యాగ్‌ చేశారు. 

మరోవైపు ఆ మృతదేహాలు కరోనా వల్ల చనిపోయిన వారివి కావని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఆ మృతదేహాలకు చెందిన వారు ఎవ్వరూ రాలేదనీ..వాటిని తీసుకెళ్లలేదనీ..అవి గుర్తు తెలియని మృతదేహాలని తెలిపింది.  హాస్పిటల్ మార్చురీలో అవి పాడైపోవడంతో మున్సిపల్‌ వాహనంలో శ్మశానవాటికకు తరలిస్తున్నామని తెలిపింది. ఈక్రమంలో కొంతమంది వీడియో ద్వారా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారనీ..అటువంటివారిపై చర్యలు తీసుకోవాలని కోల్‌కతా పోలీసులకు ఆదేశించింది.   

Read:  మరోసారి కఠినమైన లాక్‌డౌన్: సిద్ధం అవుతున్న రాష్ట్రాలు