Viral Video: జ్యూస్‌లో మూత్రం కలిపి అమ్ముతున్న వ్యక్తి.. లీటరు మూత్రం స్వాధీనం

ఖాన్ జ్యూస్ షాప్‌లో సోదాలు చేయగా.. లీటరు మానవ మూత్రం నింపిన డబ్బా కనిపించిందని అన్నారు.

Viral Video: జ్యూస్‌లో మూత్రం కలిపి అమ్ముతున్న వ్యక్తి.. లీటరు మూత్రం స్వాధీనం

Updated On : September 14, 2024 / 5:14 PM IST

జ్యూస్‌లో మూత్రం కలిపి అమ్ముతున్నాడు ఓ వ్యక్తి. అతడి షాప్‌లోని ఓ బాటిల్లోనూ స్థానికులు మూత్రాన్ని గుర్తించారు. ఇన్ని రోజులు తాము అతడు అమ్మిన ఆ జ్యూస్‌నే తాగుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుకాణదారుడిపై దాడి చేశారు.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని శివారు ప్రాంతంలో చోటుచేసుకుంది. దుకాణదారుడిపై స్థానికులు దాడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఖుషీ జ్యూస్ కార్నర్ యజమాని ఆమిర్ ఖాన్, అతని షాపులో పనిచేసే ఓ మైనర్ బాలుడికి స్థానికుల దాడిలో గాయాలయ్యాయి.

జ్యూస్‌లో మూత్రం కలిపి అమ్ముతున్న ఆమీర్ ఖాన్‌పై స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఆ షాపు వద్దకు చేరుకున్నారు. ఆమిర్ అలియాస్ షాజిద్ ఖాన్ సహా అతడి సహాయకుడిని స్థానికుల దాడి నుంచి రక్షించారు. ఆమిర్ ఖాన్, అతడి సహాయకుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై ఏసీపీ భాస్కర్ వర్మ స్పందిస్తూ… జ్యూస్‌లో మూత్రం కలిపినట్లు పోలీసులకు సెప్టెంబర్ 13న ఫిర్యాదు అందిందని తెలిపారు. ఇందిరా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దుకాణంలో సోదాలు చేయగా.. లీటరు మానవ మూత్రం నింపిన డబ్బా కనిపించిందని అన్నారు.

Viral Video: ఊలాలా పాటకు డెన్మార్క్‌లో అదిరిపోయే స్టెప్పులేసిన భారతీయ మహిళ