Goa Election : గోవాలో హంగ్ ? క్యాంపు రాజకీయాలు షురూ..

గోవాలో మాత్రం ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టలేదు. దీంతో అక్కడ హంగ్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్న...

Goa Election : గోవాలో హంగ్ ? క్యాంపు రాజకీయాలు షురూ..

Goa Results

Updated On : March 10, 2022 / 1:27 PM IST

Goa Election Results 2022 : ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కాషాయ పార్టీ మరోసారి వికసించింది. నాలుగు రాష్ట్రాల్లో స్పష్టమైన మెజార్టీ సాధించే దిశగా ముందుకెళుతోంది. కానీ.. గోవాలో మాత్రం ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టలేదు. దీంతో అక్కడ హంగ్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు బీజేపీ 18 సీట్లు, కాంగ్రెస్ 12, ఆప్ 03, టీఎంసీ+04, ఇతరులు 03 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 21 సీట్లు కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. ఏ పార్టీకి మెజార్టీ రాదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

Read More : Goa Results : గోవా అంటేనే గోడ దుంకుడు..! అధికారంపై పార్టీల్లో గుబుల్

అనుకున్నట్లుగానే.. మ్యాజిక్ ఫిగర్ కు దరిదాపులో నిలిచిపోయాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అలర్ట్ అయ్యాయి. తమ అభ్యర్థులను ఇతర పార్టీలు ఆకర్షించకుండా ఉండేందుకు క్యాంపు రాజకీయాలు షురూ చేశాయి. కాంగ్రెస్ అభ్యర్థులను రిసార్ట్ తరలించినట్లు సమాచారం.గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సంపాదించినా.. ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిన సంగతి తెలిసిందే. ఈ సారి కూడా అదే జరుగుతుందా ? అనే భయంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. దీంతో ఫలితాలు విడుదలవుతున్న కొద్దీ.. వారిలో టెన్షన్ మొదలైంది. అభ్యర్థులను తరలించడానికి ఉరుకులు పరుగులు పెడుతున్నారు. కాంగ్రెస్ క్యాంపు బాధ్యతలను ట్రబుల్ షూటర్ గా పేరొందిన డీకే శివకుమార్ కు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీయేతర పార్టీలను సంప్రదిస్తామని కాంగ్రెస్ నేతలు వెల్లడిస్తున్నారు. చిన్న పార్టీల నేతలు కీలకంగా మారారు. వారితో ఇప్పటి నుంచే సంప్రదింపులు జరుపుతున్నారు. కానీ.. బీజేపీ మాత్రం ధీమాగా ఉంది. బీజేపీనే మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని సీఎం ప్రమోద్ సావంత్ జోస్యం చెబుతున్నారు.

Read More : Uttarakhand-Goa : ఒకే విడతలో ఉత్తరాఖండ్‌, గోవా ఎన్నికలు

మరోవైపు.. కౌంటింగ్ ప్రారంభానికంటే ముందు… దివంగత మనోహర్ పారికర్.. గోవా సీఎం ప్రమోద్ సావంత్ నియోజకవర్గంలోని సాంక్వెలిమ్ లోని శ్రీ దత్త మందిర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం ఉదయాన్నే ఆలయానికి చేరుకుని..విజయం సాధించాలని పూజలు చేశారు. ఆయన వెంట కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. ఇక కౌంటింగ్ విషయానికి వస్తే.. గురువారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ను ప్రారంభించారు. అభ్యర్థుల సమక్షంలో కౌంటింగ్ ను ప్రారంభించారు. పటిష్ట బందోబస్తు మధ్య కౌంటింగ్ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లను లెక్కించారు. అనంతరం ఈవీఎంల నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తున్నారు. మరి ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుందా ? లేదా బీజేపీ మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంటుందా ? అనేది చూడాలి.