Sanjay Raut : లోక్‌సభ ఎన్నికలకు ముందు గోద్రా తరహా ఘటన జరగొచ్చు…సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

దేశంలో మత కలహాలపై శివసేన యూబీటీ నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా గోద్రా రైలులో మంటలు చెలరేగడం వంటి సంఘటన జరగవచ్చనే భయం ఉందని సంజయ్ రౌత్ ఆరోపించారు....

Sanjay Raut : లోక్‌సభ ఎన్నికలకు ముందు గోద్రా తరహా ఘటన జరగొచ్చు…సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

Sanjay Raut

Sanjay Raut : దేశంలో మత కలహాలపై శివసేన యూబీటీ నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా గోద్రా రైలులో మంటలు చెలరేగడం వంటి సంఘటన జరగవచ్చనే భయం ఉందని సంజయ్ రౌత్ ఆరోపించారు. (Shiv Sena leader Sanjay Raut) దేశంలో 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు (Ahead Of 2024 Lok Sabha Polls) మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించడమే భారతీయ జనతా పార్టీ సింగిల్ పాయింట్ ఎజెండా అని ఆయన పేర్కొన్నారు. (Godhra-Like Incident May Take Place) 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు గోద్రా తరహా ఘటన జరగొచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

Rice Export : సింగపూర్‌కు బియ్యం ఎగుమతికి భారత్ అనుమతి

ఆగస్టు 31, సెప్టెంబర్ 1న ముంబయిలో విపక్ష కూటమి ఇండియా సమావేశానికి ముందు రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ మాట్లాడారు. ‘‘గోద్రా ఎలా జరిగిందో అదే విధంగా, రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అయోధ్యకు రైలులో భక్తులు వస్తారని ఆయన చెప్పారు. అలా గోద్రా రైలులో మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించే అవకాశముందని ఎంపీ ఆరోపించారు. దీంతో పాటు పుల్వామా తరహా దాడి జరుగుతుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు.

CBI Case : మైనారిటీ స్కాలర్‌షిప్ స్కాంపై సీబీఐ కేసు

మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించే అవకాశముందని, ఈ అల్లర్ల పట్ల ప్రజలు భయపడుతున్నారని రౌత్ పేర్కొన్నారు. 2002వ సంవత్సరం ఫిబ్రవరి 27వతేదీన జరిగిన గోద్రా రైలు అగ్నిప్రమాదం గుజరాత్‌లో అల్లర్లకు దారితీసింది. 2019వ సంవత్సరం ఫిబ్రవరి 14వతేదీన జమ్మూ శ్రీనగర్ హైవేపై భద్రతా సిబ్బందితో వెళుతున్న వాహనాల కాన్వాయ్‌పై జరిగిన దాడిలో 40 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నికలకు ముందు ఇలాంటి క్రూరమైన చర్యలు చేపట్టవచ్చని ఎంపీ రౌత్ భయం వ్యక్తం చేశారు. ముంబయిలో జరిగే భారత కూటమి సమావేశంలో దీనిపై చర్చిస్తామని ఎంపీ రౌత్ వివరించారు.