Gold Price High: మహిళలకు బిగ్‌షాక్.. ఆకాశాన్ని తాకుతున్న గోల్డ్ ధరలు.. ఆల్ టైమ్ హైకి చేరిన వెండి

బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో తులం బంగారం రేటు ఏకంగా రూ.1,030 పెరిగింది. దీంతో మునుపెన్నడూ లేనివిధంగా 24 క్యారెట్‌ బంగారం రూ.61,360ని తాకింది. వెండి ధరసైతం ఆల్ టైమ్ హైకి చేరింది.

Gold Price High: మహిళలకు బిగ్‌షాక్.. ఆకాశాన్ని తాకుతున్న గోల్డ్ ధరలు.. ఆల్ టైమ్ హైకి చేరిన వెండి

Gold Price

Updated On : April 6, 2023 / 1:15 PM IST

Gold Price High: బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. మునుపెన్నడూలేని రీతిలో ధరలు పెరుగుతుండటంతో మహిళలు బంగారం అంటేనే బెంబేలెత్తిపోతున్నారు. బుధవారం ఒక్కరోజే హైదరాబాద్‌లో తులం పసిడి ధర ఏకంగా రూ. 1,030 ఎగబాకింది. దీంతో మునుపెన్నడూ లేనివిధంగా 24 క్యారెట్‌ల బంగారం రూ. 61,360 చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం రూ. 950 ఎగబాకి రూ. 56,250కి చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ బంగారం ధర రూ. 61,080కి చేరింది. దేశీయ మార్కెట్‌లో తులం బంగారం రూ. 61,00 మార్కును అధిగమించడం ఇదే తొలిసారి అని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

Gold price : పసిడి ధరకు రెక్కలు..10 గ్రాముల బంగారం ధర రూ. 57,490..రూ. 60వేలు దాటుతుందంటున్న నిపుణులు

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఔన్స్ కు 2,032 డాలర్లకు పెరిగింది. అయితే ఎంసీఎక్స్‌లో ధరలు 10 గ్రాముల గరిష్టంగా రూ. 61,181కి చేరాయి. బుధవారం సగటు ధర రూ. 60,978 వద్ద ట్రేడవుతున్నాయి. గత నెల ప్రారంభంలో ఆసియా మార్కెట్లలో బంగారం ధరలు 1.80శాతం ఎగబాకింది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితి, ఆర్థిక పరిస్థితుల్లో ముదుపరులు తమ పెట్టుబడులకు ప్రత్యామ్నాయంగా బంగారాన్ని ఎంచుకుంటారన్నది తెలిసిందే. అందుకే బంగారం ధరలు సహాజంగానే పెరుగుతుంటాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

బంగారంతో పాటు వెండి ధరలు పెరుగుతున్నాయి. కిలో వెండి ధర ఒక్కరోజే ఏకంగా రూ. 2,900 పెరిగింది. దీంతో కిలో వెండి ధర 80,700లను తాకింది. వెండి ధర విషయానికి వస్తే ఇదే ఆల్ టైమ్ హై ధర. గత నెల ప్రారంభం నుంచి వెండి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. మార్చి 10న కిలో వెండి ధర రూ. 67,300 ఉంది. నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ. 13,400 పెరిగింది.