Gold Rate : తగ్గిన బంగారం.. పెరిగిన వెండి ధరలు

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. గత ఏడాది కాలంగా బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తుంది. గతేడాది ఆగస్టులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53 వేలు ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58 వేలుగా ఉంది. గతేడాది ఇదే నెలలో బంగారంపై పెట్టుబడి పెట్టినవారు భారీగా నష్టపోయారు. ఏడాది కాలంలో బంగారంపై రూ.9 వేలకు పైగా తగ్గింది.

Gold Rate : తగ్గిన బంగారం.. పెరిగిన వెండి ధరలు

Gold Rate

Updated On : August 10, 2021 / 7:36 AM IST

Gold Rate : బంగారం ధరలు భారీగా తగ్గాయి.. గత ఏడాది కాలంగా బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తుంది. గతేడాది ఆగస్టులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53 వేలు ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58 వేలుగా ఉంది. గతేడాది ఇదే నెలలో బంగారంపై పెట్టుబడి పెట్టినవారు భారీగా నష్టపోయారు. ఏడాది కాలంలో బంగారంపై రూ.9 వేలకు పైగా తగ్గింది.

బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ రోజు నగల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 43,350గా ఉంది. సోమవారంతో పోల్చుకుంటే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.490 తగ్గింది.

ఇక పెట్టుబడులకు వాడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఈ ఉదయానికి రూ.47,300గా ఉంది. సోమవారంతో పోల్చితే మంగళవారం 10 గ్రాముల బంగారంపై రూ.530 తగ్గింది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.43,350.
విజయవాడలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.43,350.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.43,350.
బెంగళూరులో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.43,350.
చెన్నైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.43,800.
ఢిల్లీలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.45,500.

ఇక వెండి ధర విషయానికి వస్తే..

గత పది రోజుల్లో వెండి ధర 6 సార్లు తగ్గగా 3 సార్లు పెరిగింది. మంగళవారం ఉదయం వెండి ధర 1 గ్రాము రూ.68.70 ఉంది. 10 గ్రాముల ధర రూ.687 ఉంది. 100 గ్రాములు ధర రూ.6,870 ఉండగా… కేజీ వెండి ధర… రూ.68,700 ఉంది. నిన్న కేజీ వెండి ధర రూ.3,700 పెరిగింది. ఆరు నెలల లెక్క చూస్తే ఫిబ్రవరి 10న కేజీ వెండి ధర రూ.74,400 ఉంది. అప్పటికీ ఇప్పటికీ ధర రూ.5,700 తగ్గింది.