controlled delivery list: కేంద్రం కీలక నిర్ణయం.. కంట్రోల్డ్ డెలివరీ పరిధిలో ఆ వస్తువులు
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు రకాల వస్తువులను కంట్రోల్డ్ డెలివరీ పరిధిలో చేర్చింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సేస్ అండ్ కస్టమ్స్ నోటిఫికేషన్ జారీ చేసింది

Silvar
controlled delivery list: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు రకాల వస్తువులను కంట్రోల్డ్ డెలివరీ పరిధిలో చేర్చింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సేస్ అండ్ కస్టమ్స్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ జాబితాలో బంగారం, వెండి జూవెలరీ, విలువైన లోహాలు, కరెన్సీ, పురాతన వస్తువులు, ఇతర గూడ్స్ ను కంట్రోల్ డెలివరీ జాబితాలో చేర్చింది.
Tesla Offices: ఉద్యోగులను తొలగించి ఆఫీసు మూసేసిన టెస్లా
ఇకపై జాబితాలోని వస్తువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవటం కదరదు. అదేవిధంగా దేశం నుంచి విదేశాలకు ఎగుమతి చేయడం కూడా సాధ్యం కాదు. అనుమానాస్పద సరుకుల విషయంలో సంబంధిత అధికారి ట్రాకింగ్ పరికరాన్ని కూడా ఉంచే అధికారం ఉంటుంది.
ICF Chennai : ఐసీఎఫ్ చెన్నైలో అప్రెంటిస్ ఖాళీల భర్తీ
కంట్రోల్డ్ డెలివరీ జాబితాలో నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్థాలు, పలు రసాయనాలు, నియంత్రిత పదార్థాలు లేదా వాటి ప్రత్యామ్నాయాలు, మద్యం ఇతర మత్తు పానీయాలు, నకిలీ కరెన్సీ, సిగరెట్లు, పొగాకు, పొగాకు ఉత్పత్తులు, వన్యప్రాణుల ఉత్పత్తులు వంటివి కూడా ఉన్నాయి. నిబంధనల ప్రకారం.. ఈ లిస్ట్‌లో ఉన్న వాటి ఎగుమతులు లేదా దిగుమతులకు సంబంధిత అధికారులు ఆమోదం కచ్చితంగా ఉండాల్సిందే.