గూగుల్ పేలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ డిజిటల్ గిఫ్ట్ కార్డ్‌లు

Google Pay
గూగుల్ పే మరో కొత్త డిజిటల్ గిఫ్ట్ కార్డ్స్‌కు తెరలేపింది. పైన్ ల్యాబ్స్‌కు చెందిన క్విక్ సిల్వర్ అనే కంపెనీ భాగస్వామ్యంలో ఇది మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే 150 ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బ్రాండ్లకు సంబంధించిన వర్చువల్ గిఫ్ట్ కార్డ్స్‌కు ఓకే చెప్పేశారు. దేశవ్యాప్తంగా 1500సిటీల్లో రియల్ టైంలో ఇది మొదలుపెట్టనున్నారు.
ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ కార్డ్, యూబర్ ఈ-గిఫ్ట్, అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్, గూగుల్ ప్లే గిఫ్ట్ కోడ్ లాంటి గిఫ్ట్ కార్డులు వస్తున్నాయి. క్విక్ సిల్వర్ మరో కన్జ్యూమర్ బ్రాండ్ అయిన వోహోను గూగుల్ పే స్పాట్ ప్లాట్ ఫాంపై లిస్ట్ చేసింది. దాని ద్వారా వ్యాపారులు వారి ఎక్స్‌పీరియన్స్‌ను యాప్ లోనే క్రియేట్ చేస్తారు.
వోహో యాప్ ను సెర్చ్ చేసి దాని ద్వారా గిఫ్ట్ కార్డులు పంపుకోవచ్చు. అది కాకపోయినా బిజినెస్ ట్యాబ్ లో ఉండే గిఫ్ట్ కార్డ్ స్టోర్ లోని కార్డులలో ఎంచుకుని పంపుకోవచ్చు. ఒక్కసారి కొంటే ఆ డిజిటల్ కార్డును ఈ మెయిల్ లేదా ఎస్సెమ్మెస్ ద్వారా పంపుకోచ్చు. అప్పుడే మనకు రూ.500 వరకూ క్యాష్ బ్యాక్ పొందడానికి అర్హులం అవుతాం.
క్విక్ సిల్వర్.. వోహో డిజిటల్ కార్డ్ స్టోర్ ను ఆన్ చేసి ఉంచింది. బటన్ క్లిక్ చేసి డిజిటల్ గిఫ్టింగ్ విధానం ద్వారా కన్జ్యూమర్ ఎక్స్‌పీరియన్స్ మరింత బెటర్ గా పొందొచ్చని పైన్ ల్యాబ్స్ ప్రెసిడెంట్ కుమార్ సుదర్శన్ స్టేట్‌మెంట్లో చెప్పారు. గూగుల్ స్పాట్ ప్లాట్ ఫాం అనేది గతేడాదే లాంచ్ అయింది.