Omicron : ఈ నెల 28 నుంచి నైట్ కర్ఫ్యూ

ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా విస్తరిస్తుంది. దేశంలో కొత్త వేరియంట్ కరోనా కేసుల సంఖ్య 400 దాటింది. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాలు ఒమిక్రాన్ కట్టడిపై దృష్టిపెట్టాయి.

Omicron : ఈ నెల 28 నుంచి నైట్ కర్ఫ్యూ

Omicron (2)

Updated On : December 26, 2021 / 11:07 AM IST

Omicron : ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా విస్తరిస్తుంది. దేశంలో కొత్త వేరియంట్ కరోనా కేసుల సంఖ్య 400 దాటింది. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాలు ఒమిక్రాన్ కట్టడిపై దృష్టిపెట్టాయి. శనివారం కరోనా గైడ్ లైన్స్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. గుంపుగా ఉండకూడదని, తప్పనిసరిగా మాస్క్ ధరించాలని స్పష్టం చేసింది. ఇక ఇదే తరహాలో కర్ణాటక ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

చదవండి : Omicron : ఏపీలో కొత్తగా రెండు ఒమిక్రాన్ కేసులు

రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. జనం గుమికూడటం, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది. ఇక జనాల రద్దీ అధికంగా ఉండే.. రెస్టారెట్లు, పబ్బుల్లో 50 శాతం అక్యుపెన్సీతో నడపాలని సూచించారు. ఇక ఇప్పటికే మాస్క్ తప్పనిసరి అనే నిబంధనను తీసుకొచ్చింది ప్రభుత్వం. మాస్క్ లేకుండా కనిపిస్తే జరిమానా విదిస్తుంది.

చదవండి : Omicron Effect on Films: టెన్షన్.. టెన్షన్.. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో?!

ఇక ఇప్పటికే కర్ణాటకలో 38 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దేశంలో మొత్తం 422 మంది ఒమిక్రాన్ బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇక ఇప్పటి వరకు ఈ వేరియంట్ నుంచి కోలుకొని 130 మంది ఇళ్లకు వెళ్లగా 292 మంది చికిత్స పొందుతున్నారు. నిన్నటి వరకు 415 కేసులు ఉండగా ఈ రోజు కొత్త ఏడు కేసులు నమోదయ్యాయి. వాటిలో రెండు ఏపీలో వెలుగుచూశాయి.