జులై 31 నుంచి ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు

  • Published By: madhu ,Published On : July 26, 2020 / 09:28 AM IST
జులై 31 నుంచి ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు

Updated On : July 26, 2020 / 9:58 AM IST

కరోనా వైరస్ కారణంగా..మూడు నెలల నుంచి స్కూళ్లు తెరుచుకోలేదు. వైరస్ అంతకంతకు ఎక్కువవుతుండడంతో ప్రభుత్వ స్కూళ్లు తెరవడానికి రాష్ట్రాలు ఇష్టపడలేదు. వైరస్ కట్టడి అయిన తర్వాతే..స్కూళ్లు ఓపెన్ చేయాలని భావిస్తున్నాయి. ఇప్పటికే విద్యా రంగం తీవ్రంగా నష్టపోయింది.

కొన్ని స్కూళ్లు ఆన్ లైన్ పాఠాలు బోధిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు టీవీల ద్వారా పాఠాలు బోధిస్తున్నాయి. ఈ విషయంలో చండీఘర్ రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో ప్రీ నర్సరీ నుంచి 8వ తరగతికి ప్రవేశాలు జులై 31వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని UT education డిపార్ట్ మెంట్ వెల్లడించింది.

విద్యార్థులు ఆన్ లైన్ లో ఆగస్టు 14వ తేదీలోగా..దరఖాస్తులు సమర్పించాలని సూచించింది. జులై 27వ తేదీ నుంచి డిపార్ట్ మెంట్ వెబ్ సైట్ (www.chdeducation.gov.in) లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. Right to Education (RTE) నిబంధనల ప్రకారం..ప్రభుత్వ పాఠశాలల ప్రవేశాలుంటాయని వెల్లడించారు.

మొత్తం 115 ప్రభుత్వ పాఠశాలలు, వీటిలో 40 senior secondary schools, 53 high schools, 13 middle schools, 8 primary schools and one nursery స్కూళ్లు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకోని అభ్యర్థులు మాత్రమే ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.