Fatehpur : మద్యం మత్తులో తాళికట్టేందుకు వచ్చిన వరుడు.. దిమ్మతిరిగే షాకిచ్చిన వధువు
ఫతేపూర్ లోని ఘాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దరౌలీ నుండి వరుడు ఊరేగింపుగా బయలుదేరాడు. బంధువులు, స్నేహితులు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. వరుడు ఊరేగింపుగా పెండ్లి మండపానికి వచ్చిన సమయంలో ...

Groom Drink Alcohol
Groom Drunk Alcohol At wedding : పెండ్లంటే సందడి వాతావరణం ఉంటుంది.. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో పెండ్లితంతు ఎంతో ఉత్సాహంగా జరుగుతుంది. ఇక స్నేహితుల సందడి మామూలుగా ఉండదు.. కొన్ని పెళ్లిళ్లలో మద్యం మామూలే.. ఆ మద్యమే పెళ్లికొడుకు కొంపముంచింది.. ఫలితంగా ఏకంగా పెళ్లే ఆగిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేపూర్ లో చోటుచేసుకుంది.
Also Read : Vizag Tahsildar Murder : విశాఖలో అర్ధరాత్రి దారుణం.. తహసీల్దార్ హత్య.. ల్యాండ్ మాఫియా పనేనా?
ఫతేపూర్ లోని ఘాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దరౌలీ నుండి వరుడు ఊరేగింపుగా బయలుదేరాడు. బంధువులు, స్నేహితులు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. వరుడు ఊరేగింపుగా పెండ్లి మండపానికి వచ్చిన సమయంలో స్వాగతం పలికేందుకు వధువు బంధువులు వెళ్లారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వరుడు కారు దిగేందుకు నానా తంటాలు పడ్డాడు. పెళ్లి ఊరేగింపులో వచ్చిన వ్యక్తులు అతన్ని ఎలాగోలా కారులో నుంచి కిందకు దింపేశారు. వరుడు నిలబడే స్థితిలోకూడా లేకపోవటంతో తీసుకెళ్లి మంచంపై పడుకోబెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పెళ్లికూతురు అతన్ని పెళ్లిచేసుకోనంటూ తేల్చి చెప్పేసింది.
మద్యం మత్తులోఉన్న వరుడికి అసలేం జరుగుతుందో తెలియదు.. హాయిగా తెల్లవార్లు నిద్రపోయాడు. ఉదయం లేచిన తరువాత అసలు విషయం తెలిసింది. పెళ్లి క్యాన్సిల్ అయిందని. అమ్మాయి తరపు బంధువులు వరుడిని బంధించారు. పెళ్లికోసం చేసిన ఖర్చులు చెల్లించాలని వరుడు కుటుంబ సభ్యులను డిమాండ్ చేశారు. దీంతో వరుడు తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. పలు దఫాల చర్చల అనంతరం పోలీసుల సంక్షంలో ఇరువర్గాల వారు రాజీకుదుర్చుకున్నారు. దీంతో పెళ్లి లేకుండా వరుడు తిరిగి వెళ్లిపోయాడు.