Night Curfew : ఒమిక్రాన్ టెన్షన్..గుజరాత్ లో నైట్ కర్ఫ్యూ పొడిగింపు
కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" టెన్షన్ నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Curfew
కోవిడ్ కొత్త వేరియంట్ “ఒమిక్రాన్” టెన్షన్ నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూని డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఎనిమిది ప్రధాన నగరాలు-అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, రాజ్‌కోట్, వడోదర, భావ్‌నగర్, జామ్‌నగర్, జునాఘర్ నగరాల్లో నైట్ కర్ఫ్యూను డిసెంబర్ 31 పొడిగించినట్టు ప్రకటించింది. ఆయా నగరాల్లో రాత్రి ఒంటి గంట ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉండనుంది. ఈ మేరకు గుజరాత్ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అంతకుముందు డిసెంబర్-10 వరకే నైట్ కర్ఫ్యూ పొడిగించబడిన విషయం తెలిసిందే. ఇక,ఇప్పటివరకు గుజరాత్ లో 11 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
ALSO READ J&K Delimitation : జమ్మూలో కొత్తగా ఆరు,కశ్మీర్ లో ఒకటి..డీలిమిటేషన్ ప్రతిపాదనపై రగడ