లక్కీ బాయ్ : ట్రంప్-మోడీతో సెల్ఫీ…’వీడియో చూడండి

భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కలిసి ఓ బాలుడు తీసుకున్న సెల్ఫీ ట్రెండింగ్ లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు సూపర్ సెల్ఫీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ట్రంప్-మోడీతో బాలుడు సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో తీసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆదివారం(సెప్టెంబర్-22,2019)హ్యూస్టన్ లో జరిగిన హౌడీ మోడీ కార్యక్రమానికి మోడీ,ట్రంప్ హాజరయ్యారు. హోడీ మోడీ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న పలువురు కళాకారులను మోడీ, ట్రంప్ కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఓ బాలుడు సెల్ఫీ తీసుకోవడానికి అనుమతించాలని ట్రంప్ ను కోరాడు. ట్రంప్ అందుకు సమ్మతించి మోడీని కూడా సెల్ఫీ దిగడానికి రమ్మన్నారు. ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాలకు అధినేతలైన మోడీ, ట్రంప్‌లతో సెల్ఫీ కావాలని కోరాడు. ఇందుకు ట్రంప్ ఓకే చెప్పి మోడీతో కలిసి ఆ బాలుడితో సెల్ఫీ దిగారు.
ఆ బాలుడితో ఎంతో ఆనందంగా దేశాధినేతలు సెల్ఫీకి ఫొజిచ్చారు. ఆ తర్వాత బాలుడి భుజాన్ని తట్టి నరేంద్ర మోడీ అభినందించారు. ట్రంప్ కూడా నవ్వుతూ అక్కడి నుంచి ముందుకు కదిలారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రధాని కార్యాలయం విడుదల చేసింది. ఈ బాలుడు చాలా అదృష్టవంతుడు అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. జీవితానికి సరిపోయే సెల్ఫీని తీసుకున్నాడంటూ పొగిడేస్తున్నారు.
The kid got a selfie of a lifetime. Keep asking…. You never know what you may get. https://t.co/04gDl1E8Tf
— Abhijit Deshmukh (@iabhijitdesh) September 23, 2019