PM Modi: 5 కోట్ల పోస్టు కార్డులతో ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు

ప్రధాని నరేంద్ర మోడీ త్వరలోనే 71వ జన్మదినోత్సవాన్ని జరుపుకోనున్నారు. ఎప్పటి లాగానే ఈ ఏడాది కూడా భారతీయ జనతా పార్టీ మోడీ పుట్టినరోజులు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది.

PM Modi: 5 కోట్ల పోస్టు కార్డులతో ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు

Pm Modi (1)

Updated On : September 5, 2021 / 6:36 AM IST

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ త్వరలోనే 71వ జన్మదినోత్సవాన్ని జరుపుకోనున్నారు. ఎప్పటి లాగానే ఈ ఏడాది కూడా భారతీయ జనతా పార్టీ మోడీ పుట్టినరోజులు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఒకప్పుడు గుజరాత్ సీఎంగా నుండి ఇప్పుడు భారత ప్రధాని వరకు ఇరవై ఏళ్లకు పైగా మోడీ సేవలకు గుర్తుగా బీజేపీ సేవా, సమర్పణ్ అభియాన్ అనే రెండు సేవా కార్యక్రమాలను భారీ ఎత్తున తలపెట్టనుంది. మొత్తం 20 రోజుల పాటు ఈ సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైంది.

ప్రధాని పుట్టినరోజైన సెప్టెంబర్ 17న మొదలు కానున్న ఈ సేవా వేడుకలు అక్టోబర్ 7వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ప్రధాని పుట్టినరోజుకు సంబంధించిన సేవా కార్యక్రమాలు, వేడుకలకు సంబంధించి షెడ్యూల్ చేసుకున్న బీజేపీ ఈ మేరకు తాజాగా ప్రకటన ద్వారా తెలిపింది. ప్రధాని పుట్టినరోజు నాడు ఆయన సేవలను అభినందిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న బూత్ ల నుండి ఐదు కోట్ల పోస్టు కార్డుల ద్వారా శుభాకాంక్షలు తెలపనున్నట్లు వెల్లడించారు.

ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు ప్రధాని పుట్టినరోజు వేడుకలపై చర్చించి కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ వేడుకలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు ఆదేశించగా.. వాటి పర్యవేక్షణ బాధ్యతలను పార్టీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గియా, వినోద్ సొంకర్, పురందేశ్వరి, రాష్ట్రీయ కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాజ్ కుమార్ చాహర్ కు అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.