vasundhara patni : ఎంత ధైర్యశాలి.. ఏకంగా సింహం తోకపట్టుకుంది.
ఓ యువతి సింహం తోకపట్టుకొని దాని వెంట వెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Harsh Goenka Daughter
vasundhara patni : కొందరు క్రూర జంతువులతో ఫోటోలు దిగుతూ ఆశ్చర్యపరుస్తుంటారు. మరికొందరు అడవికి రాజు సింహంతో ఆటలాడుతుంటారు. ఇటువంటి వీడియోలు మనం సోషల్ మీడియాలో చాలానే చూసుంటాం. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
చదవండి : Cheetah Attack On Lion : సింహాన్ని పరుగు పెట్టించిన చిరుతపులి
ఓ యువతి సింహం తోక పట్టుకొని దాని వెనుక నడుచుకుంటూ వెళ్తుంది. సాధారణంగా సింహాన్ని చూస్తేనే కొందరికి ప్రాణం పోయినంత పనవుతుంది. భయంతో ఒణికిపోతుంటారు. ఇక జూ పార్క్‌లో సింహానికి, పర్యాటకులకు మధ్య దూరం ఉంటుంది కాబట్టి కొద్దిగా భయం అనిపించినా చూస్తుంటారు.
చదవండి : Lion In Toilet : జెంట్స్ టాయిలెట్ లోంచి బయటకొస్తున్న ఆడ సింహం..ఇదేం సిగ్గురా బాబూ అంటున్న జనాలు..
తాజాగా వైరల్ అయిన ఫొటోలో ఉన్న యువతి వ్యాపార దిగ్గజం హర్ష్ గోయెంకా కూతురు వసుంధర పత్నీ. ఈమె సింహం తోక పట్టుకుని నవ్వుతూ నడుస్తుంది. అయితే ఆమె తండ్రి ఇండియన్ ఆర్‌పీజీ గ్రూప్ కాంగ్లోమెరిట్ ఛైర్మన్ అయిన హర్ష్ గోయెంకా ఎందుకు సంబంధించిన వీడియో తోపాటు” ఆమె నా కూతురు. మీరు ఆమె తల్లిని ఊహించుకోగలరా ” అనే క్యాప్షన్‌తో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.