డబ్బులు కాదు : హెల్త్ రిపోర్టులు ఇచ్చే ఏటీఎం

ఏటీఎంలోంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. కానీ హర్యానాలోని గుర్‌గావ్ లో ఏటీఎంల నంచి హెల్త్ రిపోర్టులు రానున్నాయి. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా గుర్‌గావ్‌లో మన ఆరోగ్యం ఎలావుందో 10 నిముషాల్లో తెలుసుకోవచ్చు. స్మార్ట్ సిటీ అంటే అన్నీ సేవలు స్మార్ట్ గా ఉండాలి కదూ. అందుకే గుర్‌గావ్ స్మార్ట్ సిటీలో మన ఆరోగ్యం ఎలా ఉందో కేవలం 10 నిమిషాల్లో తెలుసుకునేలా ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. గుర్‌గావ్ లోని 60 పబ్లిక్ ప్లేస్‌లలో హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నారు.
ఈ హెల్త్ ఏటీఎంకు సంబంధించిన వివరాలను అధికారులు తెలిపిన వివరాల ప్రకారం డీపీఆర్ వీటి ఏర్పాటునకు టెండర్ల ప్రక్రియను ప్రారంభించనుంది. హెల్త్ ఏటీఎంలలో వైద్య పరీక్షలకు ఎంత చెల్లించాలనేది త్వరలో నిర్ణయించనున్నారు. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నవారే కాకుండా ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేని వారు కూడా తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవచ్చు.
ఈ సందర్భంగా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ భరద్వాజ మాట్లాడుతూ గుర్‌గావ్ సిటీలో హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేసేందుకు సర్వే జరుగుతోంది. వీటిని రైల్వే స్టేషన్, బస్‌స్టాండ్ వంటి 60 పబ్లిక్ ప్లేస్ లలో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. దీని కోసం ప్లానింగ్ జరుగుతోందనీ అతి త్వరలోనే హెల్త్ ఏటీఎంలకు సంబంధించి డీసీఆర్ లు రెడీ చేస్తామని తీసుకొస్తామన్నారు.
ఇసిజి నుండి డెంగ్యూ వరకు
డిజిటల్ హెల్త్ ఎటిఎం ఇసిజి, హెచ్‌ఐవి, హిమోగ్లోబిన్, ప్రొటెక్టివ్ చైల్డ్ హెల్త్, ఊపిరితిత్తులు, బీపీ, స్కిన్, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, గర్భం, శరీర ఉష్ణోగ్రత, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, షుగర్ వంటి పలు టెస్ట్ లు చేసిన తరువాత రిపోర్ట్ ను అందజేస్తామన్నారు. వీటితో పాటు హెల్త్ ఎటిఎమ్ నుంచి బరువు, పొడవు వంటివి కూడా అందుబాటులో ఉంటాయన్నారు. కేవలం 10 నిమిషాల్లో రిపోర్ట్ ను హెల్త్ ఏటీఎంల ద్వారా పొందవచ్చని తెలిపారు. ప్రతీ హెల్త్ ఏటీఎం సెంటర్ లోను ఒక ఆపరేటన్ ఉంటాడని తెలిపారు.
బయోమెట్రిక్ పరికరంలో బొటనవేలు ఉంచిన వెంటనే శరీరం స్కాన్ మొత్తం చేయబడుతుంది. పరీక్ష కోసం ఆరోగ్య ఎటిఎమ్‌లో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ పరికరంలో బొటనవేలు ఉంచి..తరువాత, మొబైల్ నంబర్‌ను ఆప్షన్ లో నంబర్ నమోదు చేసుకోవాలి. ఇందులో, OTP (వన్ టైమ్ పాస్‌వర్డ్) మీ మొబైల్ నంబర్‌కు వస్తుంది. ఎటిఎమ్‌లో ఓటిపిని కొట్టిన వెంటనే, టెస్ట్ చేయించుకోవాలనుకున్నవారి పేరు, అడ్రస్, ఇ-మెయిల్ ఐడి ఇన్ఫర్మేషన్ లను ఫిల్ చేయాలి.
తరువాత..ఎటిఎమ్‌లోని సెన్సార్లు టెస్ట్ చేయించుకోవాలనుకునేవారు యంత్రంలో నిలబడి ఉన్నా.. కూర్చున్నప్పుడు శరీర కదలికలను స్కాన్ చేస్తాయి. ఆ తర్వాత రిపోర్ట్ కూడా రెడీ అయిపోతుంది. ఆ రిపోర్టులు ఇమెయిల్ కు..నమోదు చేసిన మొబైల్ నంబర్‌కు వచ్చేస్తాయి.