Haryana : దీపావళి కానుకగా కార్లను ఇచ్చిన కంపెనీ.. సంబరాలు చేసుకున్న స్టాఫ్
దీపావళికి చాలా కంపెనీలు ఉద్యోగులకు బహుమతులు ఇస్తుంటాయి. సెలబ్రేషన్స్ చేస్తుంటాయి. హర్యానాలోని ఓ కంపెనీ తమ వద్ద ఎంతో విధేయతగా పనిచేస్తున్న ఉద్యోగులకు ఏం బహుమతిగా ఇచ్చిందో తెలుసా?

Haryana
Haryana : దీపావళి పండుగకి వారం ముందే ఆ కంపెనీ ఉద్యోగుల్లో పండుగ ఉత్సాహం వచ్చేసింది. హర్యానా పంచకులలోని ఓ ఫార్మా స్యూటికల్ కంపెనీ యజమానులు తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇవ్వడంతో స్టాఫ్ సంబరాల్లో మునిగిపోయారు.
మిట్స్ హెల్త్ కేర్‌కు చెందిన కంపెనీ తమ కంపెనీలో పని చేస్తున్న 12 మంది ఉద్యోగులకు దీపావళి కానుకగా కార్లను బహుమతిగా ఇచ్చింది. కృషి, పట్టుదల కంపెనీ పట్ల చూపించిన విధేయతకు కృతజ్ఞతగా ఈ కానుక ఇచ్చినట్లు కంపెనీ డైరెక్టర్ ఎంకే భాటియా చెప్పారు. త్వరలో మరో 38 మందికి కార్లను బహుమతిగా ఇవ్వనున్నట్లు చెప్పారు.
Samantha : సమంతకు ప్రత్యేక బహుమతి పంపించిన నయనతార.. ఏంటో తెలుసా..?
కంపెనీ యజమానులు కార్లను బహుమతిగా ఇవ్వడంతో స్టాఫ్ సంతోషం వ్యక్తం చేసారు. కంపెనీ తమకు కారును బహుమతిగా ఇస్తుందని కలలో కూడా ఊహించలేదని వారు ఆశ్చర్యపోయారు. ఈ ఏడాది దీపావళి పండుగ నవంబర్ 12 ఆదివారం జరుపుకుంటున్నారు. ఇక కార్లు బహుమతి అందుకున్న ఆ కంపెనీ ఉద్యోగులకు ఈ ఏడాది దీపావళి పండుగ రెట్టించిన ఉత్సాహాన్ని ఇవ్వబోతోంది.
#WATCH | Panchkula, Haryana: A pharma company owner, M. K. Bhatia, gifts cars to his employees ahead of Diwali. pic.twitter.com/SVrDbAWlc1
— ANI (@ANI) November 4, 2023