హ‌త్రాస్‌ హర్రర్ : మ‌హిళ‌లపై చెడు ఆలోచ‌న‌లు వ‌స్తే…భ‌య‌ప‌డేలా చర్యలు తీసుకుంటాం

  • Published By: venkaiahnaidu ,Published On : October 2, 2020 / 07:00 PM IST
హ‌త్రాస్‌ హర్రర్ : మ‌హిళ‌లపై చెడు ఆలోచ‌న‌లు వ‌స్తే…భ‌య‌ప‌డేలా చర్యలు తీసుకుంటాం

Updated On : October 2, 2020 / 7:23 PM IST

Committed to women safety: Yogi Adityanath ఉత్తర‌ప్ర‌దేశ్‌లోని హ‌త్రాస్‌లో 19 ఏళ్ల ద‌ళిత మ‌హిళ సామూహిక అత్యాచారం, హ‌త్య అదేవిధంగా కేసులో యూపీ పోలీసులు వ్య‌వ‌హరించిన తీరుపై సీఎం యోగీ ఆదిత్యానాథ్ ప్ర‌భుత్వం దేశ‌వ్యాప్తంగా తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో తన ప్రభుత్వంపై వస్తోన్న ఆరోపణలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్పందించారు.

మహిళల భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని యోగి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. శుక్ర‌వారం యోగి ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ…. తల్లులు, సోదరీమణుల భద్రత, అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.యూపీలో త‌ల్లులు, కూతుళ్ల‌పై చెడు ఆలోచ‌న‌లు వ‌స్తేనే భ‌య‌ప‌డేలా ఓ ఊదాహ‌ర‌ణ‌గా నిలిచేలా చ‌ర్య‌లు తీసుకుంటామాని హామీ ఇచ్చారు.

భ‌విష‌త్తులో సైతం వారిపై నేరాల‌కు పాల్ప‌డ‌కుండా ఉండేలా శిక్షిస్తామ‌న్నారు. ఇది త‌మ ప్ర‌భుత్వ నిబ‌ద్ధ‌త‌, హామీ అని యోగి ట్వీట్‌ చేశారు. యూపీ ప్రభుత్వం ఆడవారి భద్రతకు, అభివృద్ధికి కట్టుబడి ఉందని యోగి చేశారు.