Hathras rape case, కఠినంగా శిక్షించాలన్న మోడీ

Hathras rape case : హత్రాస్ లో దళిత యువతిపై జరిగిన గ్యాంగ్ రేప్ పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈ క్రమంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. స్వయంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. సిట్ దీనిపై విచారణ జరుపనుంది. వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని యూపీ సీఎం సూచించారు.
పొలంలో పనిచేస్తున్న బాలికను లాక్కెళ్లి అత్యంత ఘోరంగా అత్యాచారం జరిపారు కామాంధులు. 19 ఏళ్ల యువతిని రేస్ చేసి చిత్రహింసలు పెట్టారు కిరాతకులు. విషయం ఎవరికీ చెప్పకుండా ఉండేందుకు ఆమె నాలుక తెగ్గోయడం వారి పైశాచికత్వానికి నిదర్శనం. యూపీలో విపక్షాలు యోగి సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి.
తీవ్ర గాయాలతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు 2020, సెప్టెంబర్ 29వ తేదీ మంగళవారం ప్రాణాలు విడిచింది. హత్రాస్ ఘటన 2012 నాటి నిర్భయ కేసును గుర్తుకు తెచ్చింది. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు పెల్లుబికాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రముఖులు సైతం దీనిపై స్పందిస్తున్నారు. హత్రాస్ ఘటన క్రూరంగా అభివర్ణిస్తున్నారు.