Assembly Elections 2023: పొట్టోడే కానీ అహం మాత్రం చాలా పొడవు.. కేంద్రమంత్రిపై ప్రియాంక ఘాటు వ్యాఖ్యలు

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చింది ఆయనేనని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక అన్నారు. గ్వాలియర్-చంబల్ ప్రాంతంలోని ప్రజలకు ద్రోహం చేశారని దుయ్యబట్టారు.

Assembly Elections 2023: పొట్టోడే కానీ అహం మాత్రం చాలా పొడవు.. కేంద్రమంత్రిపై ప్రియాంక ఘాటు వ్యాఖ్యలు

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మనిషి పొట్టిగానే ఉంటారు కానీ అహం చాలా పొడవు ఉంటుందంటూ ఆమె అన్నారు. బుధవారం మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గ్వాలియర్‌లోని మాజీ రాజకుటుంబానికి చెందిన వారసులపై ప్రియాంక గాంధీ మాటల దాడి చేశారు. ఆయన (సింధియా) తన కుటుంబ సంప్రదాయాలను బాగా పాటిస్తున్నారని విరుచుకుపడ్డారు. తొలుత కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న జ్యోతిరాదిత్య సింధియా.. 2020లో తన మద్దతుదారులతో కలిసి కమల్ నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీలో చేరారు.

ఇది కూడా చదవండి: సీఎం శివరాజ్‌ను బీజేపీ ఎందుకు నమ్మదో చెప్పిన కాంగ్రెస్ సీనియర్ నేత

గత ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాను సింధియాతో కలిసి పనిచేసినప్పుడు, ఆయన చాలా అహంకారపూరితంగా వ్యవహరించారని ప్రియాంక అన్నారు. ఆయన అహంకారంతో పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడ్డారని ఆమె గుర్తు చేశారు. ‘‘మేం యూపీకి చెందిన వాళ్లం. కోపం వచ్చినప్పుడు దాన్ని బయటపెడతాం. కానీ మమ్మల్ని మహారాజ్ అని పిలుచుకునే అలవాటు లేదు. మహారాజ్ అని మనం చెప్పుకోలేని అతి పెద్ద సమస్య ఇది. గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సింధియా కుట్ర పన్నడం ద్వారా పార్టీకి, ప్రజలకు ద్రోహం చేశారు’’ అని ఆమె అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చింది ఆయనేనని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక అన్నారు. గ్వాలియర్-చంబల్ ప్రాంతంలోని ప్రజలకు ద్రోహం చేశారని దుయ్యబట్టారు. మధ్యప్రదేశ్‌లో పార్టీ ఎన్నికల ప్రచారానికి మొదటి నుంచి నాయకత్వం వహిస్తున్న ప్రియాంక గాంధీ చివరి రోజు ప్రచారంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, హోం మంత్రి నరోత్తమ్ మిశ్రాలను కూడా టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.

ఇది కూడా చదవండి: 10 రోజుల్లో ఎన్నికలు.. మెగా ప్లాన్ సిద్ధం చేసిన ప్రధాని మోదీ