Assembly Elections 2023: సీఎం శివరాజ్‌ను బీజేపీ ఎందుకు నమ్మదో చెప్పిన కాంగ్రెస్ సీనియర్ నేత

మధ్యప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. బహిరంగ సభల్లో కాంగ్రెస్, ప్రతిపక్షాలను ప్రధాని మోదీ టార్గెట్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ప్రజలు ప్రధానమంత్రి హామీలను విశ్వసిస్తున్నారని ప్రధాని చెప్తున్నారు.

Assembly Elections 2023: సీఎం శివరాజ్‌ను బీజేపీ ఎందుకు నమ్మదో చెప్పిన కాంగ్రెస్ సీనియర్ నేత

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి బుధవారం ముగుస్తుంది. సాయంత్రం 6.00 గంటలకు అన్ని రకాల ఎన్నికల ప్రచారం ఆగిపోతుంది. మరోవైపు మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ప్రస్తుతం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అవినీతి అతిపెద్ద సమస్య అని కమల్‌నాథ్ పేర్కొన్నారు. అలాగే ఆయన బీజేపీకి పలు ప్రశ్నలు సంధించారు. మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎందుకు చేయలేదన్నది మొదటి ప్రశ్న? ఇక సీఎం ఎన్నిక‌ల్లో ప్ర‌ధాని మోదీ అంత యాక్టివ్‌గా ఎందుకు ఉంటున్నార‌నేది రెండో ప్ర‌శ్న‌.

ఇది కూడా చదవండి: మధ్యప్రదేశ్, ఛత్తీస్‭గఢ్‭లలో ఎన్నికల ప్రచారానికి ఈరోజుతో చెక్

2018లో 15 ఏళ్ల బీజేపీ పాలనను కూకటివేళ్లతో పెకిలించి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. అయితే, 15 నెలల్లోనే తిరుగుబాటు జరిగి బీజేపీ అధికారంలోకి తిరిగి వచ్చింది. ఈసారి ఎంపీపీలో కాంగ్రెస్‌కు ఎలాంటి చిత్రం ఏర్పడుతోంది? ఈ ప్రశ్నకు కమల్‌నాథ్ స్పందిస్తూ.. తాను ఎలాంటి గణాంకాలను, సర్వేలను విశ్వసించనని, ఓటర్లను మాత్రమే విశ్వసిస్తానని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో ప్రతి వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కమల్‌నాథ్ పేర్కొన్నారు. యువత నిరుద్యోగంలో ఉన్నారని, రైతు సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. చిరు వ్యాపారులు సైతం అవినీతితో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి బీజేపీ బాధితుడేనని, అందుకే కాషాయ ప్రభుత్వాన్ని తొలగించాలని అందరూ కోరుకుంటున్నారని కమలనాథ్ అన్నారు.

ఇది కూడా చదవండి: రాజస్థాన్‭లో ఆచారం మారలేదు.. ఇదే కంటిన్యూ అయితే కాంగ్రెస్‭ పని అయిపోయినట్టే

మధ్యప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. బహిరంగ సభల్లో కాంగ్రెస్, ప్రతిపక్షాలను ప్రధాని మోదీ టార్గెట్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ప్రజలు ప్రధానమంత్రి హామీలను విశ్వసిస్తున్నారని ప్రధాని చెప్తున్నారు. దీనిపై కమల్ నాథ్ మాట్లాడుతూ.. వాస్తవానికి ఇది ముఖ్యమంత్రి ఎన్నిక అని, ప్రధాని మోదీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అన్నారు. ప్రధాని మోదీ నాలుగైదు కేంద్రాల నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారని, ఆయన తన పార్టీ తరపున ప్రచారం చేయడానికి ఆసక్తితోనే ఉన్నప్పటికీ ఆశ్చర్యకరంగా తమ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రకటించలేకపోయారని కమలనాథ్ ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్‌కు శివరాజ్‌సింగ్ చౌహాన్ ఏమి చేశారో పార్టీకి తెలుసు కాబట్టే సీఎం శివరాజ్‌ను మళ్లీ అభ్యర్థిని చేయలేదని కమల్‌నాథ్ పేర్కొన్నారు.