Assembly Elections 2023: మధ్యప్రదేశ్, ఛత్తీస్‭గఢ్‭లలో ఎన్నికల ప్రచారానికి ఈరోజుతో చెక్.. ఇక ఇంటింటి ప్రచారమే

అక్టోబర్ 9 నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్‭గఢ్‭ అసెంబ్లీల ఎన్నికలకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విధించారు. అంటే ఆరోజు నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఇది వెలువడిన అనంతరమే రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ గెలుపు కోసం జోరుగా ప్రచారం నిర్వహించాయి.

Assembly Elections 2023: మధ్యప్రదేశ్, ఛత్తీస్‭గఢ్‭లలో ఎన్నికల ప్రచారానికి ఈరోజుతో చెక్.. ఇక ఇంటింటి ప్రచారమే

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సహా ఛత్తీస్‭గఢ్‭ అసెంబ్లీ ఎన్నికల రెండవ విడత ఎన్నికల పోలింగ్‌కు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. గత నెల రోజులుగా సాగుతున్న ఎన్నికల ప్రచార సందడి ఈరోజు సాయంత్రం 6 గంటలకు నిలిచిపోతుంది. నెల రోజులుగా బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర రాజకీయ పార్టీల నేతలు ఆయా పార్టీల అభ్యర్థుల కోసం ముమ్మరంగా ప్రచారం నిర్వహించాయి. ఇప్పుడు అభ్యర్థులు రాబోయే 48 గంటల పాటు బహిరంగ ప్రచారం చేయకుండా ఇంటింటికి మాత్రమే ప్రచారం చేయగలుగుతారు.

అక్టోబర్ 9 నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్‭గఢ్‭ అసెంబ్లీల ఎన్నికలకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విధించారు. అంటే ఆరోజు నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఇది వెలువడిన అనంతరమే రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ గెలుపు కోసం జోరుగా ప్రచారం నిర్వహించాయి. ఈరోజుతో ప్రచారం ముగుస్తుంది. నవంబర్ 17వ తేదీ ఉదయం నుంచి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మధ్యప్రదేశ్‌లోని మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో, అలాగే ఛత్తీస్‭గఢ్‭లోని రెండవ దశలో భాగంగా 70 స్థానాలకు పోలింగ్ జరగనుంది.

ఇది కూడా చదవండి: రాజస్థాన్‭లో ఆచారం మారలేదు.. ఇదే కంటిన్యూ అయితే కాంగ్రెస్‭ పని అయిపోయినట్టే

మధ్యప్రదేశ్, ఛత్తీస్‭గఢ్‭ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం అక్టోబర్ 9న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 21న నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల సమర్పణ తేదీని అక్టోబర్ 30గా నిర్ణయించారు. నామినేషన్ పత్రాల పరిశీలన అక్టోబర్ 31 వరకు జరిగింది. నామినేషన్ల ఉపసంహరణ నవంబర్ 2తో పూర్తైంది. ఇక ఆ రోజు నుంచి ఎన్నికల సందడి కాక మీద కొనసాగింది. నవంబర్ 17న ఇరు రాష్ట్రాల్లో ఓటింగ్ నిర్వహించి డిసెంబర్ 3న ఫలితాలు రానున్నాయి. ఛత్తీస్‭గఢ్‭ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ నవంబర్ 7న పూర్తైంది. ఇందులో 20 స్థానాలకు ఎన్నికల జరిగింది.