చెప్పినట్టు చేయకుంటే కరోనా విషయంలో ఏం చెయ్యలేం

  • Published By: vamsi ,Published On : October 2, 2020 / 09:54 PM IST
చెప్పినట్టు చేయకుంటే కరోనా విషయంలో ఏం చెయ్యలేం

కరోనా ఉదృతి దేశంలో కొనసాగుతున్నప్పటికీ ప్రజల్లో కొందరు మాత్రం ఏ మాత్రం జాగ్రత్తలు పాటించట్లేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మాస్క్‌ను ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు అనుసరించకుండా ఉంటే కరోనా మహమ్మారి చైన్‌ను బ్రేక్ చెయ్యడం కష్టమని ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్థన్‌ చెప్పుకొచ్చారు.



హెల్త్‌ అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికీ చాలా మంది మాస్క్‌లు ధరించడం లేదని, సామాజిక దూరం పాటించట్లేదని ఇటువంటి పరిస్థితి కొనసాగితే.. ‍కరోనా మహమ్మారిని తరిమి కొట్టడం సాధ్యం కాదని అన్నారు. దేశంలో అన్‌లాక్‌ ప్రక్రియ మొదలైన తరువాత దాదాపు అన్ని సంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు పునఃప్రారంభం అయ్యాయని, ఇలాంటి సమయంలో కరోనా మార్గదర్శకాలు పాటించడం చాలా అవసరమని ఆయన స్పష్టం చేశారు.



అలాగే ఫ్రంట్ లైన్ వారియర్స్‌ను ఆయన అభినందించారు. హెల్త్‌ వర్కర్ల కృషిని అభినందించారు. వారి సేవ ఎన్నటికి మరవలేనిదని అంటూ అభిప్రాయపడ్డారు. అవార్డులు గెలుచుకున్న వారికి అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశంలో స్వచ్ఛ భారత్‌ లక్ష్యాన్ని కూడా వారే ముందుండి నడిపిస్తున్నారని అభిప్రాయపడ్డారు. కరోనా నుంచి మందులు కంటే మాస్క్ మాత్రమే ఎక్కువగా కాపాడగలదని ఆయన అన్నారు.