Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన 100 ఏళ్ల నాటి వంతెన

. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వరదలు ముంచెత్తుతున్నాయి. బిలాస్పూర్, సోలన్, సిమ్లా, సిర్మౌర్, హమీర్పూర్, మండి, కులు తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన 100 ఏళ్ల నాటి వంతెన

Himachal Pradesh Heavy Rain

Himachal Pradesh Heavy Rain: ఉత్తరాదిపై కుంభవృష్టి కురుస్తోంది. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ వంటి రాష్ట్రాల్లో ఎడతెగని వర్షాలు పడుతున్నాయి. దీంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండగా, కొండచరియలు విరిగి పడుతున్నాయి. ఢిల్లీలో ఆదివారం రాత్రి 8.30 గంటల వరకు రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. 1982 తరువాత ఇంత తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదు కావటం ఇదే తొలిసారి. ఉత్తరాధిలో వర్షాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్షించారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనూ వరదలు ముంచెత్తుతున్నాయి. బిలాస్పూర్, సోలన్, సిమ్లా, సిర్మౌర్, ఉనా, హమీర్పూర్, మండి, కులు తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలోని జనజీవనం స్తంభించిపోయింది.

Telangana Rains : రానున్న ఐదు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి జిల్లా వర్షాలకు అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా బియాస్, ఉహల్ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బియాస్ – సట్లేజ్ లింక్ ప్రాజెక్టు యొక్క పండోహ్ ఆనకట్ట బియాస్ నదిలో వరద నీరు పోటెత్తడంతో పండోహ్ పట్టణంలోకి నీరు చొచ్చుకొచ్చింది. బియాస్ నదిలో దవదా వంతెన వరద ధాటికి కొట్టుకుపోయింది. అదే సమయంలో 100 ఏళ్ల నాటి పండోహ్ వంతెన కూడా వరదలో కొట్టుకుపోయింది. మండి నగరంలోని బియాస్ – సుకేతిఖాడ్ సంగమం వద్ద ఉన్న చారిత్రక పంచవక్త్ర ఆలయ ప్రాంగణంలోకి కూడా బియాస్ నది నీరు చేరింది.

Heavy Rains : భారీ వర్షాలతో అల్లాడుతున్న ఉత్తరాది..

మండి జిల్లాలో బియాస్ నది ఉధృతంగా ప్రవహించడంతో ఆటో -బంజార్ ను కలిపే 40ఏళ్ల వంతెన కొట్టుకుపోయింది.  భారీ వర్షాలు, తీవ్రమైన నీటి ఎద్దడి కారణంగా సిమ్లా – కల్కా రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. భారీ వర్షాలతో కోటి సన్వారా రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ నీట మునిగింది.  భారీ వర్షాల కారణంగా ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సీఎం విజ్ఞప్తి చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నాలాలు, డ్రెయిన్లు దగ్గర ప్రభుత్వం తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని, వరద బాధితులను సత్వరమే సహాయం అందించాలని సూచించారు.