Heavy Rain : మరో రెండు రోజులు భారీ వర్షాలు, మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.  రాగల 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశమున్నట్టు అంచనా వేస్తోంది.

Heavy Rain : మరో రెండు రోజులు భారీ వర్షాలు, మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్

Heavy Rains In Kerala Imd Warning

Updated On : November 15, 2021 / 8:12 PM IST

Heavy Rain Kerala : కేరళను మళ్లీ వర్షాలు వణికిస్తున్నాయి. కేరళలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.  రాగల 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశమున్నట్టు అంచనా వేస్తోంది. దీంతో మూడు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్‌ జిల్లాలకు ఐఎండీ రెడ్‌ అలర్ట్‌ జారీ ప్రకటించింది.

Read More : PM Modi : 77 మంది కేంద్ర మంత్రులు..8 గ్రూపులుగా విభజన, ఎందుకంటే

అకాల వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.  దీంతో వర్ష ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేరళ సీఎం పినరయ్‌ విజయన్‌ సూచించారు. గత మూడు రోజులుగా కేరళలో వర్షాలు దంచి కొడుతున్నాయి. మూడు జిల్లాపై వర్షాల ప్రభావం అధికంగా ఉంది. కుండపోత వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులు జలమయం అయ్యాయి. ఎర్నాకులంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది.

Read More : Nalgonda : ఉద్రిక్తతలను పెంచిన బండి సంజయ్ టూర్

బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇడుక్కి, త్రిసూర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. దక్షిణ కేరళలోని పలుప్రాంతాల్లోని రహదారులు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని వివిధ డ్యామ్‌లలో నీటిమట్టం భారీగా పెరిగింది. ఇడుక్కి రిజర్వాయర్‌కు చెందిన చెరుతోని డ్యామ్‌లోని ఒక షట్టర్‌ను తెరిచారు. ముల్ల పెరియార్‌ డ్యామ్‌ నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. దీంతో పెరియార్‌ నదికి ఇరువైపులా నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.