Heavy Rains : ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం… 100 మందికి పైగా మృతి, వరద నీటిలో కొట్టుకుపోయిన భవనాలు, రోడ్లు, రైల్వే ట్రాక్లు

ఢిల్లీతోపాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఢిల్లీలో రెండో రోజు పాఠశాలలు మూతపడ్డాయి.

Heavy Rains : ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం… 100 మందికి పైగా మృతి, వరద నీటిలో కొట్టుకుపోయిన భవనాలు, రోడ్లు, రైల్వే ట్రాక్లు

Heavy Rains (9)

Northern States Heavy Rains : ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు ఉత్తరాదిని కుదిపేస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో రెండు వారాల్లో వర్షాల కారణంగా 100 మందికి పైగా మృతి చెందారు. గడిచిన రెండు రోజుల్లో 40 మందికి పైగా మృతి చెందారు. హిమాచల్, ఉత్తరాఖండ్, పంజాబ్, యూపీ, హర్యానాలో మృతుల సంఖ్య పెరుగుతోంది. వరద నీటిలో భవనాలు, రోడ్లు, రైల్వే ట్రాక్లు కొట్టుకుపోయాయి.

హిమాచల్ ప్రదేశ్‌ లో సంభవించిన వరదల్లో 72 మంది మృతి చెందారు. వరద నీటిలో 8 మంది గల్లంతు అయ్యారు. 90 మందికి పైగా గాయాలు అయ్యాయి. వేలాది కోట్ల ఆస్తి నష్టం వాటల్లింది. హిమాచల్ లో 39 కొండచరియలు విరిగిపడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. 1 క్లౌడ్ బర్స్ట్, 29 ఆకస్మిక వరదలు సంభవించాయి. ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షం కురుస్తోంది.

IMD issues Red alert : హిమాచల్ ప్రదేశ్‌లో అతి భారీవర్షాలు..రెడ్ అలర్ట్ జారీ

పిడుగుల కారణంగా రెండు మూడు రోజుల వ్యవధిలో 34 మంది మృతి చెందారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరద సహాయక చర్యలపై దృష్టి సారించాయి. హెల్ప్ లైన్ నెంబర్స్, కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. సహాయక కార్యక్రమాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిమగ్నమయ్యారు. మంగళవారం, బుధవారం ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ కు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

ఉత్తరాఖండ్ లో ఉత్తరకాశీ, చమోలీ, టెహ్రీ గర్వాల్, డెహ్రాడూన్, పారు గర్వాల్, బాగేశ్వర్, అల్మోరా, చంపావత్, నైనిటాల్, ఉధమ్ సింగ్ నహర్ హరిద్వార్ జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ ‘ఆరెంజ్’ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీతోపాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఢిల్లీలో రెండో రోజు పాఠశాలలు మూతపడ్డాయి.

Delhi Rains: ఢిల్లీలో యమునా నది డేంజర్ మార్క్…తెగిపోయే ప్రమాదం

వర్షాలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఢిల్లీ ఎన్సీఆర్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. సెంట్రల్ ఢిల్లీ, నోయిడా, గురుగావ్ లో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. 42 ఏళ్ల తరువాత ఒక్క రోజులో ఢిల్లీలో భారీ వర్షం కురిసింది.

శనివారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్య 153 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. 1982 జులై 25 తరువాత అత్యధిక వర్షపాతం నమోదు అయింది. నాలుగు దశాబ్దాల రికార్డును బ్రేక్ చేస్తూ వర్షాలు కురుస్తున్నాయి. పగలు, రాత్రి నిర్విరామంగా వర్షం కురుస్తోంది.