అద్దె అడిగినందుకు గొడవ.. ఇంటి ఓనర్‌ని చంపేసిన యువకుడు

  • Published By: vamsi ,Published On : July 10, 2020 / 07:07 AM IST
అద్దె అడిగినందుకు గొడవ.. ఇంటి ఓనర్‌ని చంపేసిన యువకుడు

Updated On : July 10, 2020 / 10:51 AM IST

నాలుగు నెలల ఇంటి అద్దె చెల్లించాలని డిమాండ్ చేసినందుకు చెన్నై నగరంలోని కుంద్రాత్తూర్‌లో 21 ఏళ్ల యువకుడు తన ఇంటి యజమానిని పొడిచి చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మాజీ బ్యాంకు ఉద్యోగి గుణశేఖరన్(50) తన ఇంట్లో ఒక భాగాన్ని మెకానిక్-కమ్-డ్రైవర్ అయిన అజిత్ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చారు. అయితే లాక్‌డౌన్ కారణంగా పనులు లేక అతను నిరుద్యోగిగా మారిపోవడంతో నాలుగు నెలలుగా తన నెలవారీ అద్దె రూ .4వేలు చెల్లించలేదు.

ఈ క్రమంలోనే గుణశేఖరన్.. అజిత్ ఇంటిని సందర్శించి అద్దెకు డిమాండ్ చేశారు. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న అజిత్ తల్లిదండ్రులతో గుణశేఖరన్ తీవ్ర వాగ్వాదానికి దిగాడు. అజిత్ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అతని తల్లి మరియు తండ్రి ఇంటి ఓనర్‌తో వారి గొడవ గురించి ఫిర్యాదు చేశారు. దీంతో అజిత్ ఫుల్లుగా తాగి మధ్యాహ్నం గుణశేఖరన్ ఇంటికి వెళ్లి అతనితో గొడవ పడ్డాడు. గుణశేఖరన్ అజిత్‌ను వెంటనే ఇల్లు ఖాళీ చేయమని కోరాడు.

కోపంతో, అజిత్ గుణశేఖరన్ ఇంట్లోకి ప్రవేశించి, కిచెన్‌లో కత్తి తీసుకున్నాడు. గుణశేఖరన్ తనను తాను రక్షించుకోవడానికి ఇంటి నుండి బయటకు పరిగెత్తాడు, కాని జారిపడి రోడ్డు మీద పడిపోయాడు.
తన దాడిని కొనసాగిస్తూ, అజిత్ గుణశేఖరన్ మెడను రోడ్డుపై కోసి, అతని తల, ఛాతీ మరియు పొట్టలో పదేపదే పొడిచాడు. తరువాత, అతను గుణశేఖరన్ కాలును తన లుంగీతో కట్టేశారు.

కుంద్రాతుర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గుణశేఖరన్ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం క్రోమేపేట ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. అజిత్‌ను కూడా పట్టుకుని హత్య కేసులో జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

Read Here>>కుప్పం సరిహద్దుల్లో దారుణ హత్య..