IIT Bombay Professor : 5 స్టార్ హోటల్‌లో చిరిగిన సాక్స్‌లతో కూర్చున్న ఐఐటీ బాంబే ప్రొఫెసర్ ఎవరు? కొత్తవి ఎందుకు కొనడం లేదంటే?
IIT Bombay Professor : అవును.. నా చిరిగిన సాక్స్ మార్చాలి. నేను కొత్త సాక్స్ కొనగలను. కానీ ప్రకృతి అలా చేయదు. ప్రకృతిలో ప్రతిదీ పరిమితం. సాక్సులను మార్చుకునే స్థోమత ఉన్నప్పటికీ.. ప్రకృతి ఇకపై పర్యావరణ వృథాను భరించలేదంటూ వివరణ ఇచ్చారు.

IIT Bombay professor wears torn socks at 5-star hotel
IIT Bombay Professor : 5 స్టార్ హోటల్‌లో కూర్చున్న ఓ వ్యక్తి ఫోటో సోషల్ మీడియాలో కొన్నిరోజులుగా వైరల్ అవుతోంది. అతడు చూడటానికి చిరిగిన సాక్సులను ధరించి ఉన్నాడు. ఈ ఫొటను చూసిన ఇంటర్నెట్ యూజర్లు అతడు ఎవరా? అని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇంతకీ, ఈ వ్యక్తి మరెవరో కాదు.. ఐఐటీ బాంబేకి చెందిన ప్రొఫెసర్ చేతన్ సింగ్ సోలంకి. ప్రొఫెసర్ సోలంకి గత 20 ఏళ్లుగా ఐఐటీ బాంబేలో బోధిస్తున్నారు.
Read Also : OnePlus Pad Discount : కొత్త టాబ్లెట్ కొంటున్నారా? వన్‌ప్లస్ ట్యాబ్‌పై భారీ డిస్కౌంట్.. ధర ఎంత తగ్గిందంటే?
ఆయన్ను ‘సోలార్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ లేదా సోలార్ గాంధీ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న తన ఫొటోపై ప్రొఫెసర్ సోలంకి స్పందించారు. ఇందులో ఆయన కొంచెం విచిత్రమైన డ్రెస్సింగ్ సెన్స్‌కి కారణాన్ని కూడా వివరించారు. ది ఎకనామిక్ టైమ్స్ ఎనర్జీ లీడర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు సెప్టెంబర్ 25న ఢిల్లీకి వచ్చినప్పుడు తీసిన ఫొటో ఇది. హోటల్ హయత్‌లో సమ్మిట్ జరుగుతున్నప్పుడు ఎవరో ఈ ఫొటోను క్యాప్చర్ చేశారు.
20 రాష్ట్రాల్లో 43వేల కిలోమీటర్లు ప్రయాణించి.. :
ప్రొఫెసర్ సోలంకి గత కొన్ని దశాబ్దాలుగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే లక్ష్యంతో ముందుకు కొనసాగుతున్నారు. సౌరశక్తిని ప్రోత్సహించేందుకు ఆయన 20 రాష్ట్రాల్లో 43వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు. “అవును.. నా చిరిగిన సాక్స్ బయటపడ్డాయి. నేను దీన్ని మార్చాలి. నేను కొత్త సాక్స్ కొనగలను. కానీ ప్రకృతి అలా చేయదు. ప్రకృతిలో ప్రతిదీ పరిమితం. తన సాక్సులను మార్చుకునే స్థోమత ఉన్నప్పటికీ.. ప్రకృతి ఇకపై పర్యావరణ వృథాను భరించలేదని చెప్పాడు. తాను ఏది కొనుగోలు చేసినా, దానిని తగిన విధంగా వినియోగించుకునేందుకు చేతనైన ప్రయత్నం చేస్తానని సోలంకి స్సష్టం చేశారు.
కార్బన్ పాదముద్రను తగ్గించడమే లక్ష్యం :
ప్రొఫెసర్ తన పోస్ట్‌లో.. మెటీరియల్ వస్తువుల వినియోగాన్ని పెంచడం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. “నేను నా ఉత్పాదకతను పెంచడానికి బెస్ట్ గాడ్జెట్‌లను ఉపయోగించవచ్చు. కానీ, నా కార్బన్ పాదముద్రను తగ్గించడానికి నేను తక్కువ మొత్తంలో మెటీరియల్‌ని ఉపయోగించటానికి ప్రయత్నిస్తాను” అని పేర్కొన్నారు.
పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి వనరుల సమర్ధవంతమైన వినియోగానికి ప్రాధాన్యతనిచ్చే జీవిత విధానాన్ని ఆయన వివరించారు. వ్యాపారవేత్తలు ప్రతి పెట్టుబడిపై తమ లాభాలను పెంచుకోవాలని కోరుకున్నట్లే.. తాను “సామాజిక కార్యకర్త”గా “తన సమయం ప్రభావాన్ని” పెంచుకోవాలని కోరుకుంటున్నట్లు సోలంకి చెప్పుకొచ్చారు.