Raj Thackeray: అందరూ నుపుర్ శర్మను క్షమాపణ అడుగుతున్నారు. నేను ఆమెకు మద్దతు ఇస్తున్నాను

‘‘ఎందుకు అందరూ నుపుర్ శర్మనే క్షమాపణలు అడుగుతున్నారు. డాక్టర్ జకీర్ నాయక్‭కి ముందు ఆమేం తప్పుగా మాట్లాడలేదు కదా.. మరి నాయక్ నుంచి ఎందుకు ఎవరూ క్షమాపణ కోరడం లేదు? ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ హిందూ దేవుళ్లను కించపరుస్తూ మాట్లాడితే ఎందుకు ఎవరూ నోరు మెదపరు? నేను నుపుర్ శర్మను మద్దతు ఇస్తున్నాను. భేషరతుగా నా సహకారం ఆమెకు ఉంటుంది’’ అని రాజ్ థాకరే అన్నారు.

Raj Thackeray: అందరూ నుపుర్ శర్మను క్షమాపణ అడుగుతున్నారు. నేను ఆమెకు మద్దతు ఇస్తున్నాను

I supported her Nupur Sharma sasy Raj Thackeray

Updated On : August 23, 2022 / 3:41 PM IST

Raj Thackeray: మహ్మద్ ప్రవక్తపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన బహిష్కృత బీజేపీ నేత నుపుర్ శర్మకు తాను భేషరతుగా మద్దతు ఇస్తున్నానని మహారష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే అన్నారు. అక్బరుద్దీన్ వంటి నేతలు హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా వ్యాఖ్యానిస్తున్నారని, వారిని వదిలేసి నుపుర్ శర్మను అందరూ క్షమాపణలు అడగడం సమంజసం కాదని ఆయన అన్నారు. ఇక శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే లక్ష్యంగా రాజ్ థాకరే విమర్శలు చేశారు. బాలాసాహేబ్ పాటించిన విలువల్ని ఉద్ధవ్ పాటించట్లేదని దుయ్యబట్టారు.

‘‘ఎందుకు అందరూ నుపుర్ శర్మనే క్షమాపణలు అడుగుతున్నారు? డాక్టర్ జకీర్ నాయక్‭కి ముందు ఆమేం తప్పుగా మాట్లాడలేదు కదా.. మరి నాయక్ నుంచి ఎందుకు ఎవరూ క్షమాపణ కోరడం లేదు? ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ హిందూ దేవుళ్లను కించపరుస్తూ మాట్లాడితే ఎందుకు ఎవరూ నోరు మెదపరు? నేను నుపుర్ శర్మను మద్దతు ఇస్తున్నాను. భేషరతుగా నా సహకారం ఆమెకు ఉంటుంది’’ అని రాజ్ థాకరే అన్నారు.

ఇక ఉద్ధవ్ గురించి మాట్లాడుతూ ‘‘నేను శివసేనలో ఉన్నప్పుడు బాలాసాహేబ్ ఎలా వ్యవహరించేవారో నాకు తెలుసు. ఏ పార్టీ వద్ద ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటే వారికే ముఖ్యమంత్రి కుర్చీని అప్పగించేవారు. మరి ఇలాంటి విధానం ఇప్పుడెలా మారింది? ఎన్నికల ప్రచారంలో కూడా ఫడ్నవీసే ముఖ్యమంత్రి అవుతారని మోదీ, అమిత్ షా స్పష్టంగానే చెప్పారు. అప్పుడు లేని అభ్యంతరం ఎన్నికలు ముగిశాక ఎలా వచ్చింది?’’ అని థాకరే ప్రశ్నించారు.

రాజాసింగ్‎ను పార్టీ నుండి సస్పెండ్ చేసిన బీజేపీ