Kailash Vijayvargiya : అమ్మాయిలు అటువంటి బట్టలు ధరిస్తే శూర్పణఖలా కనిపిస్తారు : బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
అమ్మాయిలు ధరించే దుస్తులపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు అటువంటి దుస్తులు ధరిస్తే రామాయణంలో శూర్పణఖల్లా కనిపిస్తారని..మద్యం తాగే యువతను చూస్తే వారి చెంపలు ఛెళ్లుమనిపించాలనిపిస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.

BJP Leader Kailash Vijayvargiya girls look like Shurpanakha
Kailash Vijayvargiya : అమ్మాయిలు మంచి మంచి బట్టలు ధరించాలని.. చెడు వస్త్రధారణ (“dirty clothes”)తో ఉంటే రామాయణంలో శూర్పణఖల్లా కనిపిస్తారు అంటూ బీజేపీ సీనియర్ నేత కైలాష్ విజయవర్గీయ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జైన సమాజ్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కైలాష్ విజయవర్గీయ అమ్మాయిలు మంచి దుస్తులు ధరించాలని..లేకపోతే వారు శూర్పణఖలా కనిపిస్తారు అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అంతేకాదు నేను రాత్రి సమయంలో బయటకు వెళ్లినప్పుడు మద్యం మత్తులో ఉన్న యువత కనిపిస్తుంటారు. వారిని చూస్తుంటే నాకు కోపం వస్తుందని కారు దిగి వెళ్లి వారి చెంప చెళ్లుమనించాలనిపిస్తుందని అన్నారు. ఎంతో మంది యువతీ యువకులు మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారని..వీరిలో ఎక్కువగా చదువుకున్నవారే ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మన భారతదేశంలో మహిళలను దేవతలుగా భావిస్తాం..వారు మంచి దుస్తులు ధరిస్తే దేవతల్లా కనిపిస్తారు. కానీ చెడ్డ దుస్తులు ధరిస్తే శూర్పణఖలా కనిపిస్తారు అని అన్నారు. దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నాను.. నేను హనుమాన్ జయంతి నాడు అబద్ధం చెప్పను అంటూ చెప్పుకొచ్చారు.
Sharad Pawar: అదానీ గ్రూప్ వ్యవహారంలో విపక్షాలకు షాకిచ్చిన శరద్ పవార్.. టార్గెట్ చేశారంటూ కామెంట్స్
దేవుడు అమ్మాయిలకు అందమైన శరీరాన్ని ఇచ్చాడు..చక్కటి వస్త్రధారణతో ఉంటే వారు మరింత అందంగా కనిపిస్తారు దేవుడు ఇచ్చిన అందమైన శరీరానికి తగినట్లుగా ఉండాలని విజయవర్గీయ అన్నారు. మంచి బట్టలు ధరించేలా తల్లిదండ్రులు వారి పిల్లలకు నేర్పించాలని సూచించారు. విద్య అవసరం లేదు. విజయ్‌వర్గియా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో బీజేపీ నేతలు పదే పదే మహిళలను అవామానిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి వ్యాఖ్యలు బీజేపీ నేతల ఆలోచనలను..వైఖరికి అద్దంపడుతున్నాయని కాంగ్రె నేత సంగీతా శర్మ మండిపడ్డారు. కైలాస్ వర్గీయ మహిళలను శూర్పణఖలతో పోల్చటం..వారి దుస్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయటం భారతదేశ సంస్కృతా? అంటూ ప్రశ్నించారు.
Karnataka Polls: బీజేపీకి మద్దతు ఇచ్చినందుకు కిచ్చా సుదీప్ సినిమాలు బ్యాన్ చేయాలట.. కోర్టులో పిటిషన్