Viral video : వాళ్లలాకాదు..పోలీసులు డబ్బులు తీసుకుంటే పని త‌ప్ప‌కుండా చేస్తారు..: పోలీసు అధికారి వ్యాఖ్యలు

ఇతర డిపార్ట్ మెంట్ వారిలా కాదు..పోలీసులు డబ్బులు తీసుకుంటే పని త‌ప్ప‌కుండా చేస్తారు అంటూ ఓ పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Viral video : వాళ్లలాకాదు..పోలీసులు డబ్బులు తీసుకుంటే పని త‌ప్ప‌కుండా చేస్తారు..: పోలీసు అధికారి వ్యాఖ్యలు

If Police Takes Money, It Gets The Job Done

Updated On : December 20, 2021 / 6:22 PM IST

If police takes money, it gets the job done : లంచం విషయంలో యూపీలోని ఓ పోలీసులు అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘పోలీసులు డబ్బు తీసుకుంటే పని త‌ప్ప‌కుండా చేస్తారు..కానీ ఇతర డిపార్ట్ మెంట్ లలో అలా కాదు డబ్బులు తీసుకుంటారు గానీ పనులు మాత్రం చేయరు..కాబట్టి పోలీసులు నిజాయితీపరులు’’అంటూ వ్యాఖ్యానించారు. ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో ‘పోలీస్ కీ’ కార్యక్రమంలో పాల్గొన్న ఓ పోలీసు అధికారి విద్యార్థులంద‌రి ముందు ప్రసంగిస్తు చేసిన ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లంచం తీసుకుంటాం అని ఎంత బహిరంగంగాచెబుతున్నాడో అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Read more : Parents selling children : పిల్లల్ని కనటం అమ్మటం..అదే భార్యాభర్తల వ్యాపారం

ఉన్నావ్ జిల్లాలో ఒక ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో పోలీస్ కీ పాఠ‌శాల అనే కార్య‌క్రమంలో విద్యార్థుల‌నుద్దేశిస్తూ ఆ జిల్లా పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ” పోలీస్ డిపార్ట్‌మెంట్ చాలా నీతి వంత‌మైన‌ది..పోలీసులు డబ్బులు (లంచాలు) తీసుకుంటారని అందరు ఆరోపిస్తుంటారు. కానీ పోలీసులు డబ్బులు కానీ ఇత‌ర డిపార్ట్‌మెంట్లు డబ్బు తీసుకున్నా ప‌ని చేయ‌వు.. కానీ మేము మాత్రం డ‌బ్బు తీసుకుంటే త‌ప్ప‌కుండా ప‌ని జ‌రుగుతుంది. కావాలంటే చూడండి మీ ఉపాధ్యాయులు క‌రోనా కార‌ణంగా ఇంట్లో కూర్చొని ప‌నిచేస్తుంటే.. పోలీసులు బ‌య‌టికొచ్చి భ‌య‌ప‌డ‌కుండా ప‌నిచేస్తున్నారు” అంటూ వ్యాఖ్యానించారు.

ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేయటంతో వైరల్ గా మారింది. ఈ వీడియో జిల్లా మేజిస్ట్రేట్ దృష్టికి వెళ్లింది. దీంతో దీనిపై విచారణకు ఆదేశించి వెంటనే నివేదిక సమర్పిచాలని అధికారులకు ఆదేశించారు.

Read more : Student’s Suicide Note : అమ్మాయిలకు రక్షణ ఆ రెండు చోట్ల మాత్రమే..విద్యార్థిని సూసైడ్ నోట్