Donate : ఆసమయంలో అప్పులు ఇస్తే తిప్పలు తప్పవా?…
భార్యభర్తలు సంధ్యాసమయంలో కలవకుండా బ్రహ్మచర్య నియమాలను పాటించాలి. ఒకవేళ ఈ సమయంలో కలిసినట్లయితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే అవకాశముంది.

Donation
Donate : హిందూ అచారా సాంప్రదాయాల్లో దాన ధర్మాలు చేయటం అన్నది పూర్వకాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. మోక్ష సాధన కోసం ఒక్కోక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. తనకున్న దానిలో కొంత బాగాన్ని లేని వారికి దానం చేస్తే పుణ్యం దక్కుతుందని భావిస్తారు. దాన ధర్మాలకు సంబంధించి అనేక రకాలు ఉన్నాయి. అన్నదానం, వస్త్రదానం, జలదానం, గోదానం, కన్యాదానం, సువర్ణదానం, భూదానం మొదలైనవి దానాల్లో కెల్ల విశిష్టమైనవి.
అయితే దానధర్మాలు చేయడానికి కూడా కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా సూర్యస్తమయం తరువాత అస్సలు దానం చేయకూడదట. ఒకవేళ అలా చేస్తే మీరు చాలా ధనం నష్టపోతారని పెద్దలు చెబుతున్నారు. చాలా మంది రాత్రి వేళలో పేదలకు, పొరుగువారికి పెరుగును దానం చేస్తూ ఉంటారు. అలా చేయటం ఏమాత్రం సరికాదట. సూర్యస్తమయం తరువాత ఎట్టిపరిస్ధితుల్లో పెరుగును దానంగా ఇవ్వరాదట. పెరుగు శుక్ర గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. శుక్రుడు మనలో సంతోషాన్ని, శ్రేయస్సును పెంచేతాడు. చీకటి పడిన తర్వాత పెరుగును దానం చేస్తే మీ కుటుంబ జీవితంలో సంతోషం తగ్గుతుంది.
సూర్యస్తమయం తర్వాత ఎవ్వరికీ అప్పులు ఇవ్వకూడదట. ముఖ్యంగా చీకటి పడిన తర్వాత మీరు ఎవరికైనా అప్పులు ఇస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట. ఇలా చేయటం వల్ల ఆర్థిక సమస్యలతో సతమతమవుతారట. అలాగే రాత్రి సమయంలో వంట చేసే సమయంలో పక్కింటి వారు ఎక్కవగా ఉల్లిపాయ, వెల్లుల్లిని అడుగుతుంటారు. అయితే ఎట్టి పరిస్ధితుల్లోనూ ఈ రెండింటిని ఇవ్వకూడదట. వీటిని అరువుగా ఇస్తే చెడు ఫలితాలతో ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్తారు.
పాలు దానం చేస్తే చాలా మంచిదని చెప్తుంటారు. అయితే సూర్యస్తమయం తరువాత పాలను దానం చేయటం ఏమాత్రం మంచిది కాదట. పాలు.. సూర్యుడు, చంద్రుడు రెండింటికి సంబంధించినదిగా చెబుతారు. పాలను దానం చేస్తే లక్ష్మీదేవికి , విష్ణమూర్తికి కోపం వస్తుందట. చికటి పడ్డాక ముఖ్యంగా మన ఇంట్లో ఉండే ఉప్పును మాత్రం ఎవరికి ఇవ్వకూడదు. ఈ ఆచారం మన పెద్దలు ఏప్పటి నుండో పాటిస్తున్నారు. ఉప్పులో లక్ష్మీదేవి ఉంటుందని నమ్ముతారు. ఉప్పును దానంగా ఇవ్వటం వల్ల లక్ష్మీదేవి మన ఇంటి నుండి వేరే వారి ఇంటికి వెళ్ళగొట్టినట్టే అవుతుందట. దుకాణ దారులు చాలా మంది చీకటి పడితే ఉప్పును విక్రయించని ఆనవాయితీనీ నేటికి అక్కడక్కడ కొనసాగిస్తున్నారు.
సాయంత్రం సమయంలో తులసి చెట్టును అస్సలు తాకకూడదు. ఒకవేళ ఇలా చేస్తే లేని పోని సమస్యలను కొని తెచ్చుకున్నవారవుతారు. భార్యభర్తలు సంధ్యాసమయంలో కలవకుండా బ్రహ్మచర్య నియమాలను పాటించాలి. ఒకవేళ ఈ సమయంలో కలిసినట్లయితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే అవకాశముంది. ఆ సమయంలో సంబంధం వల్ల పుట్టిన పిల్లలు అవలక్షణాలు కలిగి ఉంటారట. సూర్యాస్తమయ సమయంలో పిల్లలు చదవ కూడదట. ఇలా చేయటం వల్ల విద్యార్థుల మేధస్సు క్షీణించటంతోపాటు మహాలక్ష్మీ, సరస్వతి దేవి ఇద్దరూ దూరమవుతారని చెబుతారు.