నేను టాయిలెట్స్‌కి చౌకీదార్ – మోడీ

టాయిలెట్స్‌కి నేను చౌకీదార్..భారతదేశంలోని మహిళలకు రక్షణగా నేనున్నా..అంటూ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కొన్ని రోజులుగా చౌకీదార్ అనే పదాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళుతున్నారు బీజేపీ నేతలు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లోని సభల్లో పాల్గొంటున్నారు.
Read Also : జనసేన పంచె రాజకీయం : అప్పుడు పంచెలూడదీస్తా.. ఇప్పుడు పంచెకట్టే గౌరవం
2019, ఏప్రిల్ 1వ తేదీ సోమవారం మహారాష్ట్రలోని సభల్లో ప్రసంగించారు ప్రధాని. ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. నేను టాయిలెట్స్‌కి చౌకీదార్ అన్నారు. దీన్ని గర్వంగా ఫీలవుతున్నట్లు వెల్లడించారు. రైతుల గురించి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పట్టించుకోలేదంటూ విమర్శించారు. ఎన్సీపీ – కాంగ్రెస్ కలయిక అపవిత్రం అన్నారు. ఈ సందర్భంగా బహిరంగసభ నుండి ఇస్రోకు అభినందనలు తెలియచేశారు. PSLVC 45 శాటిలైట్‌ను సక్సెస్‌ఫుల్‌గా అంతరిక్షంలోకి పంపించినందుకు గర్వంగా ఉందన్నారు.
మై భీ చౌకీదార్.. ఇప్పుడు దేశంలో బాగా వినిపిస్తున్న నినాదం. ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా ఓట్లు రాబట్టుకునేందుకు బీజేపీ నయా ఎత్తుగడ వేసింది. ప్రతిపక్షాలు మోడీని చౌకీదార్ అనే పదంతో విమర్శలు చేస్తుంటాయి. ఇదే పదాన్ని బీజేపీ వాడుకుంది. ‘మై భీ చౌకీదార్’ (నేనూ కాపలాదారునే) పేరుతో మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ట్విటర్ లో కూడా మోడీ పేరు మార్చుకోవడం గమనార్హం. ప్రజల్ని ఆకట్టుకోవడానికి.. నాలుగు ఓట్లను రాల్చుకోవచ్చని బీజేపీ వ్యూహం. దీనికి ప్రతిగా కాంగ్రెస్ కూడా మై భీ బేరోజ్‌గార్ అంటూ నినాదాన్ని లేవనెత్తింది.
Read Also : ప్రళయానికి సంకేతమా! : 2 గంటల్లో 9 భూకంపాలు