Heavy Rainfall : పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు..ఐఎండీ హెచ్చరిక

దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్ర, శనివారాల్లో రెండు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ శుక్రవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో వెల్లడించింది. ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్, ఉత్తరాఖండ్, ఢిల్లీల్లో భారీవర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు....

Heavy Rainfall : పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు..ఐఎండీ హెచ్చరిక

Heavy Rainfall

Updated On : August 25, 2023 / 9:36 AM IST

Heavy Rainfall : దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్ర, శనివారాల్లో రెండు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ శుక్రవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో వెల్లడించింది. ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్, ఉత్తరాఖండ్, ఢిల్లీల్లో భారీవర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. (IMD Predicts Heavy Rainfall) యూపీలోని లక్నో, గోరఖ్ పూర్, బరేలీ, దేవిపటాన్, బస్తీ, ప్రయాగరాజ్, మురాదాబాద్, ఝాన్సీ, మీరట్, కాన్పూర్ ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. పశ్చిమబెంగాల్, సిక్కిం, బీహార్, ఒడిశా రాష్ట్రాల్లోనూ రెండు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. (Uttar Pradesh,Himachal, Uttarakhand, Delhi)

Donald Trump : పోల్ రాకెటింగ్ కేసులో డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్, బాండ్‌పై విడుదల

ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో వచ్చే ఐదురోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురవవచ్చు. ఢిల్లీ, ఎన్సీఆర్, గురుగ్రామ్, ఘజియాబాద్, నోయిడా, ఫరీదాబాద్ ప్రాంతాల్లో రాగల నాలుగురోజుల పాటటు వర్షాలు కురవనున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. కొండచరియలు విరిగిపడటం, అనేక ప్రాంతాల్లో భవనాలు కూలిపోయాయి.

Ukraine : యుక్రెయిన్‌కు త్వరలో ఎఫ్ 16 ఫైటర్ జెట్‌లు… అమెరికా టాప్ జనరల్ వెల్లడి

కులు-మండి హైవేపై కొండచరియలు విరిగిపడటంతో వందలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హిమాచల్ ప్రదేశ్‌కు భారత వాతావరణ శాఖ (IMD) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆగస్ట్ 29 వరకు ఈ వర్షపాతం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా శుక్రవారం సిమ్లాలోని అన్ని పాఠశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు.

Chandryaan-3 :చంద్రుడిపై ప్రజ్ఞాన్ రోవర్ మూన్‌వాక్‌ ప్రారంభం…ఇస్రో ల్యాండర్ ఇమేజర్ కెమెరా చిత్రాల విడుదల

హిమాచల్ ప్రదేశ్‌లో రాష్ట్రంలో 729 రోడ్లు దెబ్బతిన్నాయి. 2,897 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు పాడైపోవడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా లేదని ప్రిన్సిపల్ సెక్రటరీ (రెవెన్యూ) ఓంకార్ చంద్ శర్మ తెలిపారు. కొండచరియలు విరిగిపడి మండికి వెళ్లే రహదారిని అడ్డుకోవడంతో వందలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతానికి ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి. హిమాచల్ ప్రదేశ్‌లో రాష్ట్రంలో 242 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.12,000 కోట్ల నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి సుక్కు గురువారం ప్రకటించారు.