Rahul Gandhi: “ప్రధాని మోదీ దిన చర్య ఇదే” అంటూ రాహుల్ ట్వీట్

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ పై విమర్శలు గుప్పించారు. ఉదయం లేస్తూనే ప్రధాని మోదీ దినచర్య ఇదిగో అంటూ బుధవారం రహెహుల్ గాంధీ ట్వీట్ చేశారు

Rahul Gandhi: “ప్రధాని మోదీ దిన చర్య ఇదే” అంటూ రాహుల్ ట్వీట్

Rahul

Updated On : March 30, 2022 / 3:18 PM IST

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలపై విపక్షాలతో కలిసి కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రతిపక్షాల నుండి ఎంత ఒత్తిడి ఎదురైనా..బీజేపీ ప్రభుత్వం మాత్రం ధరలపై నియంత్రణ సాదించలేకపోతుంది. ఈక్రమంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ పై విమర్శలు గుప్పించారు. ఉదయం లేస్తూనే ప్రధాని మోదీ దినచర్య ఇదిగో అంటూ బుధవారం రహెహుల్ గాంధీ ట్వీట్ చేశారు. నిద్ర లేవడంతోనే ప్రధాని మోదీ..”పెట్రోల్-డీజిల్-గ్యాస్ రేటును ఎంత పెంచాలి, ప్రజల ఖర్చుపై పార్లమెంటులో చర్చను ఎలా ఆపాలి, యువతకి ఉపాధి కలలను ఎలా చూపించాలి, ఈరోజు ఏ ప్రభుత్వ కంపెనీని విక్రయించాలి?, రైతులను మరింత నిస్సహాయులుగా చేయడం ఎలా” అన్న అంశలపైనే మోడీ దృష్టి సరిస్తారని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

Also read:PM Modi Photo : ‘ఇంట్లో పెట్టుకున్న ప్రధాని మోడీ ఫోటో తీసేయమని బెదిరిస్తున్నారు సార్’ పోలీసులకు వ్యక్తి ఫిర్యాదు

దేశంలో నానాటికీ పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం ప్రజలపై లేనిపోని భారం మోపుతుందని రాహుల్ గాంధీ విమర్శించారు. కాగా, మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా.. ఇప్పటి నుంచే జాతీయ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం..సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జాతీయ పార్టీలు వ్యహప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. అధికార పార్టీ అభివృద్ధి మంత్రంగా ముందుకు వెళ్తుంటే..ప్రతిపక్షాలు విమర్శలే అస్త్రంగా ముందుకు వెళ్తున్నాయి.

Also read:Congress: ఢిల్లీ నుండి కొందరికే ఫోన్ .. వీహెచ్ ,జగ్గారెడ్డిలకు షాక్